సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోయిన్లు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి హీరోయిన్ గా సక్సెస్ ఫుల్ గా రాణించాలనే ఉద్దేశంతో చాలా సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉంటారు.అలాంటి హీరోయిన్లను మనం చాలా మందిని చూస్తూ ఉంటాం కొంతమంది సినిమాల్లో అవకాశాల కోసం విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అనేది మనకు తెలిసిన విషయమే.
అయితే ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చాలామంది హీరోయిన్లు చాలా ఇబ్బంది పడి ఇండస్ట్రీకి వచ్చి తర్వాత సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ గా గుర్తింపు పొందిన వారే.అలాంటి హీరోయిన్లను మనం చాలా మందిని చూసాము.
ప్రస్తుతం కూడా చాలా మంది హీరోయిన్లు అలాంటి వారే ఉన్నారు.అయితే ఒకప్పుడు తెలుగులో మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఆమని కూడా సినిమా ఇండస్ట్రీకి రాకముందు చాలా కష్టాలు పడింది అని మీకు తెలుసా తెలియకపోతే తెలుసుకుందాం రండి.
ఆమని వాళ్ల నాన్న ఓ సినిమా డిస్ట్రిబ్యూటర్ గా ఉండేవాడు ఆమని కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం.సినిమాలు చూస్తూ అద్దంలో చూస్తూ ఆమె నటిస్తూ రిహార్సల్స్ చేస్తూ ఉండేది.
అలా తను పదో తరగతి పూర్తి చేసే సమయానికి ఆమెకి సినిమాల మీద విపరీతమైన ఇంట్రెస్ట్ పెరిగింది.ఆ విషయాన్ని వాళ్ళ నాన్న తో చెప్తే సినిమాలు మనకెందుకు బుద్దిగా చదువుకో లేకపోతే పెళ్లి చేస్తాను అని చెప్పాడు.
అయిన కూడా ఆమని వినకుండా హీరోయిన్ అవుతా అని చెప్పడంతో వాళ్ళ నాన్న ఒక కండిషన్ పెట్టి ఇండస్ట్రీ పంపించారు.అదేంటంటే సినిమా సక్సెస్ అయితే పర్లేదు కాక పోయినా పర్లేదు కానీ ఎందుకు టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చెయ్ నేను ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని చెప్పాడు.

ఆ కండీషన్ మీద ఆమని ఓకే అని తమిళనాడు బయలుదేరింది అయితే ఆమని వాళ్ల నాన్న ఆమెతో పాటు ఆమని వాళ్ళ అమ్మని కూడా పంపించాడు.తమిళనాడులో టీ నగర్ లో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడనే ఉండి అక్కడి నుంచి సినిమా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టింది.
చాలా సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగి హీరోయిన్ గా చేద్దామనుకున్నాను అని చెబితే చాలామంది ఎగతాళి చేశారు.నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అన్నట్టుగా ఆమనితో మాట్లాడారు .అయిన కూడా ఎక్కడా కూడా నిరాశ పడకుండా తన వంతు ప్రయత్నం చేస్తూ వచ్చింది.అయితే అవకాశాలు వచ్చినప్పటికీ అవి పెద్దగా ఆమెకు గుర్తింపు తీసుకు రాలేదు.
తెలుగులో రాజేంద్రప్రసాద్ హీరోగా బాపు దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ పెళ్ళాం అనే సినిమాలో నటించి నటిగా మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నారు అని చెప్పాలి.ఆ తర్వాత ఎస్.వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన శుభలగ్నం సినిమాలో డబ్బులంటే అత్యాశ ఉండే క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు పొందింది.

అలాగే డబ్బుల కోసం తన భర్తను అమ్ముకునే పాత్రలో నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంది అనే చెప్పాలి శుభలగ్నం సినిమా కి కూడా ఫిలిం ఫేర్ అవార్డు లభించింది కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన శుభసంకల్పం సినిమాలో మెచ్యూరిటీ కలిగిన పర్ఫార్మెన్స్ తో మంచి గుర్తింపును సంపాదించుకొని హీరోయిన్ గా ముందుకు సాగుతూ వెళ్ళింది.శుభసంకల్పం సినిమాకి కూడా ఆవిడకి నంది అవార్డు వచ్చింది.
అలాగే ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా వచ్చిన మావిచిగురు సినిమాలో కూడా నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది…
.