చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు కాలాలు మారుతున్నప్పుడు ఏదో ఒక వ్యాధి వల్ల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.ఇలాంటి సమస్యలు రావడానికి ప్రధాన కారణం మన శరీరంలో రోగ నిరోధక శక్తి లేకపోవడమే.
మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువ గా మన ఆహారంతో పాటు తీసుకుంటూ ఉండాలి.అయితే పాల ను తాగడం వల్ల కూడా మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
పాలలో పసుపు ను కలుపుకొని తాగడం వల్ల మన శరీరంలో వేగంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే పాలలో పసుపు కలుపుకుని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
పసుపు పాలు తాగితే రోగ నిరోధకశక్తి కూడా పెరుగుతుంది.పసుపు పాలు వైరల్ దాడి నుంచి కాలేయాన్ని రక్షిస్తాయి.
కాబట్టి కాలేయ సంబంధ పచ్చ కామెర్ల లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

ఇలా పసుపు కలిపిన పాలను తాగడం వల్ల కాలేయంలో చెడు వ్యర్ధాలను తొలగిస్తాయి.దానితో పాటు ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఇతర నొప్పులను కూడా తగ్గిస్తుంది.పసుపు పాలను క్రమం తప్పకుండా తాగితే కీళ్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి.
పసుపు పాలలో ఉండే పోషకాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి లింఫోటిక్ సిస్టమ్‌ను కూడా శుభ్రంగా ఉంచుతాయి.కామెర్లు దరిచేరకుండా అరికడుతుంది.
పసుపు లో ఉండే కర్‌క్యుమిన్ శరీరంలో వైరస్ వృద్ధిని నిలిపివేస్తుంది.పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలంగా ఉంటాయి.
ఇలాంటి పాలను తీసుకోవడం వల్ల ఆడవారిలో రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు, ఇతర ఒంటి నొప్పులను తగ్గిస్తాయి.ఇలా అప్పుడప్పుడు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ పసుపు కలిపిన పాలను త్రాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది.