తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూనే తన తదుపరి సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.
ఇక ఇప్పటికే ఆయన ప్రశాంత్ నీల్( Prashanth Neel ) తో చేస్తున్న సినిమా కోసం భారీ కసరత్తులు చేయడమే కాకుండా దాదాపు 20 కేజీల బరువు కూడా తగ్గినట్టుగా తెలుస్తోంది.రీసెంట్ గా ఆయన జపాన్ ( Japan ) వెళ్లి దేవర( Devara ) సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు.
దానివల్ల ఆయన కొత్త లుక్ అయితే జనాలకు కనిపించింది.

మరి ఈ లుక్ లో చాలా సన్నబడిపోయిన ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో చూపించబోతున్నాడు.ఎందుకోసం అతన్ని సన్నబడమని చెప్పాడు అంటూ కొంతమంది కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తం చేస్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత నీల్ ను బ్లైండ్ గా నమ్మిన ఎన్టీఆర్ తను ఏది చెబితే అది చేస్తున్నాడు.మరి తాను చెప్పినట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి చూపిస్తాడా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

ఇక ఈ సినిమా తర్వాత ఆయన దేవర 2 సినిమాను చేయబోతున్నాడు.అలాగే నెల్సన్ డైరెక్షన్ లో మరొక సినిమాకి కూడా కమిట్ అయినట్టుగా తెలుస్తోంది.నెల్సన్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఊర మాస్ సినిమాగా తెరకెక్కబోతుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.చూడాలి మరి ఈ సినిమాలతో ఎలాంటి సక్సెస్ సాధిస్తారు.
తద్వారా వాళ్ళు ఎలాంటి గుర్తింపును సంపాదించుకోబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది…
.