చాలా మంది భారతీయ విద్యార్థులకు( Indian Students ) అమెరికాలో( America ) చదువుకోవాలని కలలు కనే వారికి ఇది షాకింగ్ న్యూస్.ప్రపంచ స్థాయి విద్య, అదిరిపోయే జాబ్స్, బ్రైట్ ఫ్యూచర్… ఇవన్నీ ఊరించి యూఎస్‌కి రప్పిస్తాయి.
కానీ అసలు కథ వేరే ఉంది.అక్కడ పరిస్థితి చాలా దారుణంగా తయారైంది.
చుక్కలనంటుతున్న ఫీజులు, దొరకని ఉద్యోగాలు, పెరిగిపోతున్న మానసిక ఒత్తిడితో ‘అమెరికన్ డ్రీమ్’( American Dream ) అందుకోవడం కష్టమైపోతోంది.
ఈ కఠిన వాస్తవాన్ని ఇటీవల ఒక భారతీయ మాస్టర్స్ విద్యార్థి బయటపెట్టాడు.అమెరికాలోని ఓ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ ( MS ) డిగ్రీ పొందిన ‘ఛాన్స్_స్క్వేర్8906’ ( Chance_Square8906 ) అనే రెడ్డిట్ ( Reddit ) యూజర్, తన అనుభవంతో తోటి భారతీయులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.“ఇంకో 3-4 ఏళ్ల వరకు అస్సలు అమెరికా వైపు చూడకండి” అని కుండబద్దలు కొట్టాడు.

ఇండియాలోని కోచింగ్ సెంటర్లు చెప్పేవన్నీ అబద్ధాలని, అదో పెద్ద ‘కోచింగ్ మాఫియా’ అని ఆరోపించాడు.అమెరికా అంటే అంతులేని అవకాశాల భూమి అని తప్పుడు చిత్రాన్ని చూపిస్తూ స్టూడెంట్స్‌ను తప్పుదారి పట్టిస్తున్నాయని మండిపడ్డాడు.
అమెరికా వెళ్లిన ఎంతో మంది భారతీయ విద్యార్థులు డబ్బుల్లేక, ఉద్యోగాలు దొరక్క తీవ్రమైన డిప్రెషన్‌తో పోరాడుతున్నారని ఆ యూజర్ ఆవేదన వ్యక్తం చేశాడు.లక్షలకు లక్షలు తగలేసి చదివినా, చాలా మందికి ఉద్యోగాలు రావడం లేదని, చివరికి భారీ అప్పులు, తీవ్రమైన మానసిక వేదన మిగులుతున్నాయని వాపోయాడు.“యూఎస్ యూనివర్సిటీలు మీ డబ్బులు మొత్తం గుంజేస్తాయి, బదులుగా మీకు అప్పులను, డిప్రెషన్‌ను మాత్రమే మిగులుస్తాయి” అని అతను తన పోస్టులో ఘాటుగా రాసుకొచ్చాడు.

ఈ రెడిట్ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది.దీనికి 172కి పైగా కామెంట్లు వచ్చాయి.చాలా మంది నెటిజన్లు పోస్ట్ పెట్టిన వ్యక్తి వాదనతో ఏకీభవించారు.“నిజమే బ్రదర్.నువ్వు చెప్పింది అక్షరాలా నిజం” అంటూ తమ సొంత కష్టాలను పంచుకున్నారు.
గ్రాడ్యుయేషన్ అయ్యాక ఉద్యోగం కోసం తాను ఏకంగా మూడేళ్లు తిరిగానని ఒకరు కామెంట్ చేశారు.జాబ్ మార్కెట్ రోజురోజుకీ తగ్గిపోతోందని, ముఖ్యంగా అంతర్జాతీయ విద్యార్థులకు ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా మారిందని మరొకరు హెచ్చరించారు.
అయితే, అందరూ ఇదే పాట పాడలేదు.కొందరు తమ అమెరికా చదువుల నిర్ణయాన్ని సమర్థించుకున్నారు.
కష్టాలు ఉన్న మాట వాస్తవమే అయినా, అక్కడ లభించిన అంతర్జాతీయ అనుభవం ( International Exposure ) చాలా విలువైనదని కొందరు అభిప్రాయపడ్డారు.ఎన్ని ఇబ్బందులున్నా, ఆ ఎక్స్‌పీరియన్స్ లైఫ్‌కి ప్లస్ అవుతుందని వాదించారు.
మరికొందరు నెటిజన్లు మాత్రం, ఒకవేళ అమెరికాలో చదవాలనే ప్లాన్ ఉంటే, కనీసం రెండేళ్ల పాటు వేచి చూడటం మంచిదని సలహా ఇచ్చారు.అప్పటికి జాబ్ మార్కెట్ పరిస్థితి, వీసా నిబంధనలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని వారు సూచించారు.