ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాలు అదరహో అనిపిస్తున్న విషయం తెలిసిందే.వీటిలో తెలుగు సినిమాలదే పై చేయి ఉండడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
అయితే ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ చిత్రాలనే భావించేవారు విదేశీయులు.కానీ ఆ ముద్రను టాలీవుడ్ సినిమాలు చెరిపేసాయి.
ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఇటీవల హీరోగా నటించిన దేవర( Devara ) సినిమాకు ప్రస్తుతం జపాన్( Japan ) లో వస్తున్న రెస్పాన్స్ అలాగే ఒక స్పెషల్ క్రేజ్ నెలకొనడం చూస్తే 30 ఏళ్ల క్రితం రజనీకాంత్( Rajinikanth ) గుర్తుకు వస్తున్నారు అంటున్నారు సినీ ప్రేక్షకులు.ఆ వివరాల్లోకి వెళితే.

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర. గత ఏడాది సెప్టెంబర్ లో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికి తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా మార్చి 28వ తేదీన జపాన్ లో ఈ సినిమాను విడుదల చేశారు మూవీ మేకర్స్.ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం జపాన్ వెళ్ళిన యంగ్ టైగర్ కు అక్కడ లభించిన అపూర్వ ఆదరణ ఇప్పటి దాకా ఏ ఇండియన్ స్టార్ కు దక్కలేదని చెప్పాలి.
జపాన్ సినీ ఫ్యాన్స్ యంగ్ టైగర్ ను మొట్టమొదట ఆర్ఆర్ఆర్ లో చూశారు.అందులో కొమురం భీమ్ పాత్రలో యన్టీఆర్ ప్రదర్శించిన నటన జపాన్ వారిని భలేగా ఆకట్టుకుంది.

దాంతో కొంతమంది యన్టీఆర్ పై అభిమానంతో తెలుగు భాషను కూడా నేర్చుకున్నామని చెప్పడం ఎంతో విశేషంగా మారింది.ముఖ్యంగా జపాన్ యువతి తెలుగులో మాట్లాడుతూ యన్టీఆర్ తో ఆటోగ్రాఫ్ తీసుకొనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దాంతో జపాన్ లో యన్టీఆర్ కు ఫ్యాన్స్ బ్రహ్మరథం పట్టారు.యన్టీఆర్ హవా చూస్తోంటే ముప్పై ఏళ్ళ క్రితం జపాన్ లో రజనీకాంత్ ముత్తు సినిమాకు( Muthu Movie ) లభించిన ఆదరణ గుర్తుకు వస్తోందని సినీఫ్యాన్స్ అంటున్నారు.
అయితే అప్పటి కన్నా ఇప్పుడు సినీ ఫ్యాన్స్ సంఖ్య పెరగడం వల్ల యంగ్ టైగర్ కే ఎక్కువ ఫాలోయింగ్ కనిపించిందని చెబుతున్నారు.