మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.చిరంజీవి రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉంది.
ఒక్కో సినిమాకు 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో చిరంజీవి పారితోషికం అందుకుంటున్నారు.చిరంజీవి విశ్వంభర,( Vishwambhara ) చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
చిరంజీవి క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
అయితే చిరంజీవి తాజాగా మెహర్ రమేష్( Meher Ramesh ) సోదరి మృతి గురించి సంతాపం వ్యక్తం చేశారు.
మెహర్ రమేశ్ సోదరి మాదాసు సత్యవతి( Madasu Satyavathi ) మరణం నన్ను తీవ్రంగా కలచివేసిందని చిరంజీవి కామెంట్లు చేశారు.సత్యవతి నాకు కూడా సోదరేనని చిరంజీవి ఎమోషనల్ కావడం గమనార్హం.
ఈ విషాద సమయంలో ఆ ఫ్యామిలీకి నా తమ్ముడు మెహర్ రమేష్ కు ఆ దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

చిరంజీవి చేసిన ట్విట్టర్ పోస్ట్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు.చిరంజీవి త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
చిరంజీవి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.

చిరంజీవి రాబోయే రోజుల్లో మల్టీస్టారర్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.చిరంజీవి గతంలో కొన్ని మల్టీస్టారర్ సినిమాలలో నటించినా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.చిరంజీవి ఇతర భాషల్లో సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
చిరంజీవి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.మెగా హీరోలకు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ దక్కడం లేదనే సంగతి తెలిసిందే.