బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్( Salman Khan ) గురించి మనందరికీ తెలిసిందే.సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఒకవైపు సినిమాలో నటిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు.ఈ మధ్యకాలంలో సల్మాన్ ఖాన్ నుంచి పెద్దగా సినిమాలు రావడం లేదు.
అయితే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సల్మాన్ ఖాన్.సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ సికిందర్.
( Sikandar Movie ) మురుగదాసు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా మార్చి 31న విడుదల కానుంది.ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఈ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.నా తల్లి హిందూ మతంలో పుట్టి పెరిగింది.
మా తండ్రి ముస్లింగా పెరిగారు.ఇద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
కానీ మతం అనేది వారి మధ్య పెద్ద విషయం కాదు.

ఎందుకంటే ఇద్దరూ వాళ్ల ప్రొఫెషన్స్ లో ఎదగాలని ఆలోచించారు తప్ప, మతం గురించి ఎన్నడూ పట్టించుకోలేదు.మా ఇంట్లో మతం అనే మాట పెద్దగా రాదు.అందరం కలిసి ఉంటూ హ్యాపీగా ఉంటాం.
పెట్టుకున్న లక్ష్యాలను సాధించాలన్నదే మా ఉద్దేశం.అంతే గానీ మతం గురించి ఇబ్బంది పడటం మాకు ఇష్టం లేదు అని చెప్పుకొచ్చారు సల్మాన్ ఖాన్.
ఈ సందర్బంగా సల్మాన్ ఖాన్ చేసిన వాఖ్యలు వైరల్ గా మారాయి.ఇకపోతే సికిందర్ సినిమా విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.







