ప్రస్తుత రోజులలో కోటీ రూపాయలు సంపాదించాలనే కల ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది.కొందరు జీవితాంతం కష్టపడ్డా కోటి సంపాదించలేరు.
మరికొందరు మాత్రం అదృష్టం తో రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతారు.ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం( Chhattisgarh ) సూర్గుజా జిల్లాకు చెందిన రైతు కుమారుడు జగన్నాథ్ సింగ్ సిదార్ డ్రీమ్ 11 ఫాంటసీ క్రికెట్‌లో( Dream11 Fantasy Cricket ) తన అదృష్టాన్ని పరీక్షించి, కోటి రూపాయలు గెలుచుకున్నాడు.
జగన్నాథ్( Jagannath ) మార్చి 23న న్యూజిలాండ్ – పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ కోసం డ్రీమ్ 11లో ఓ జట్టు ఏర్పాటు చేశాడు.అతను డఫీని కెప్టెన్‌గా, హెచ్.రౌఫ్‌ను వైస్-కెప్టెన్‌గా ఎంపిక చేయడంతో 1138 పాయింట్లు సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచాడు.దీంతో అతనికి కోటి రూపాయలు లభించాయి.జగన్నాథ్ గెలుపుతో అతని గ్రామస్థులు ఎంతో సంతోషించారు.ప్రజలు అతని ఇంటి వద్దకు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.ఇప్పటికే అతను తన బ్యాంకు ఖాతా నుంచి రూ.7 లక్షలు తీసుకున్నాడని, మిగిలిన మొత్తం కూడా త్వరలోనే వస్తుందని వెల్లడించాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఈ వీడియోలో అతడు తన గెలుచుకున్న కోటి రూపాయలు విషయాన్ని మొబైల్లో చూపించడం జరుగుతుంది.
తన విజయాన్ని గురించి మాట్లాడిన జగన్నాథ్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇంటిని మరింత పెద్దదిగా మారుస్తానని, తండ్రికి మంచి ఆసుపత్రిలో చికిత్స అందించనున్నానని చెప్పాడు.అలాగే వ్యవసాయ పనులు సులభంగా చేయడానికి ట్రాక్టర్ కొంటానని పేర్కొన్నాడు.ఈ విజయంతో గ్రామంలోని యువకులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు.జగన్నాథ్ సాధించిన ఈ గెలుపు, కఠిన శ్రమ, క్రికెట్ అవగాహన, సరైన నిర్ణయాలు కూడా జీవితాన్ని మార్చగలవని నిరూపించింది.
ఏది ఏమైనా బెట్టింగ్స్ పెట్టడం వల్ల అనేకమంది వారి ప్రాణాలు కోల్పోయిన సంగతులను చాలానే చూశాం.కాబట్టి అటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా ఉండాలి.