ప్రతి నెల అభిమానులు సినిమాల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల కోసం సినిమాలకు సంబంధించిన అప్డేట్ల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు.
ఇకపోతే రేపటి నుంచి ఏప్రిల్ నెల(month of April) మొదలు కాబోతోంది.అంటే పిల్లలకు హాలిడేస్ అన్నమాట.
మిగతా సీజన్లతో పోల్చుకుంటే లో విడుదల అవుతూ ఉంటాయి.కానీ ఈ సారి మాత్రం సమ్మర్ కి సినిమాలు పెద్దగా వచ్చేలా కనిపించడం లేదు.
అయితే థియేటర్లలోకి రాబోతున్న సినిమాల కంటే, ఈ నెలలో మార్కెట్లోకి రాబోతున్న కొన్ని ప్రకటనలు మాత్రం అందర్నీ ఆకర్షిస్తున్నాయి.

అవును ఏప్రిల్ నెలలో థియేటర్లలో కంటే బయటే ఎక్కువ సందడి కనిపించబోతోంది.శ్రీరామనవమి (Sri Ram Navami)అకేషన్ నే తీసుకుంటే, ఆ రోజు రామ్ చరణ్(Ram Charan) పెద్ది గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారట.తరువాత మరో 2 రోజుల్లో అల్లు అర్జున్ (Allu Arjun)పుట్టినరోజు రాబోతోంది.
ఆ రోజు బన్నీ,అట్లీ సినిమాను అధికారికంగా ప్రకటించబోతున్నారట. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తదుపరి చిత్రం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది.
ఆ ఉత్కంఠకు తెరదించుతూ ఏప్రిల్ 8న బన్నీ అట్లీ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారట.ఇక అదే రోజు అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాను కూడా ప్రకటించాలని హారిక,హాసిని బ్యానర్ భావిస్తోందట.

అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.కానీ ఈ వార్త మాత్రం వైరల్ గా మారాయి.ఇక ఏప్రిల్ నెలలో రాజాసాబ్ (Raja Saab )టీజర్, హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) ట్రైలర్ రిలీజయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట.రాజాసాబ్ టీజర్ రిలీజ్ చేసి విడుదల తేదీని ప్రకటించబోతున్నారట.
ఇక మే 9 విడుదలను దృష్టిలో పెట్టుకొని హరిహర వీరమల్లు ట్రైలర్ ను లాంఛ్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.వీటితో పాటు మహేష్, రాజమౌళి సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ కూడా ఏప్రిల్ లో జరిగే అవకాశం ఉందట.
ఇంకోవైపు విశ్వంభర విడుదల తేదీ ప్రకటన, మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ షూటింగ్ అప్ డేట్ కూడా ఏప్రిల్ నెలలోనే రాబోతున్నాయట.ఇలా ఏప్రిల్ లో థియేటర్లలో కంటే, మార్కెట్లోనే ఎక్కువ సందడి కనిపించబోతోంది.
అంటే సినిమా విడుదల కంటే అప్డేట్లే ఎక్కువగా విడుదల కానున్నట్టు తెలుస్తోంది
.