పెళ్లి తర్వాత ప్రతి పురుషుడు తండ్రి కావాలని ఆరాటపడుతుంటాడు.నాన్న అని పిలిపించుకోవాలని కలలు కంటాడు.
ఆ కలలు నిజం కావాలంటే పురుషుడు ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, అతని లైంగిక ఆరోగ్యం కూడా బాగుండాలి.అయితే లైంగిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.
మరి ఆ ఆహారాలు ఏంటో లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు టమాటాలు గ్రేట్‌గా సహాయపడతాయి.
అందువల్ల, వారంలో ఒకటి, రెండు సార్లు టమాటాలతో తయారు చేసిన జ్యూస్ తీసుకోవడం లేదా టమాటాలను సలాడ్స్ రూపంలో తీసుకోవడం చేయాలి.
అలాగే తండ్రి అవ్వాలని కోరుకునే పురుషులు తమ డైట్‌లో ఖచ్చితంగా క్యాప్సికం ఉండేలా చూసుకోండి.
క్యాప్సికంలో ఉండే పోషక విలువలు శృంగార సామర్థ్యం పెంచుతాయి.
గుమ్మడికాయ గింజలు ఆరోగ్యాన్ని పెంచడమే కాదు లైంగిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.పురుషులు రెగ్యులర్ డైట్‌లో గుమ్మడి కాయ గింజలను చేర్చుకుంటే వీర్య కణాల వృద్ధి జరుగుతుంది.మరియు ఏవైనా సంతాన సమస్యలు ఉండే తొలగిపోతాయి.
పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే ఆహారాల్లో నట్స్ కూడా ముందుంటాయి.కాబట్టి, వాల్ నట్స్, బాదం పప్పు, జీడి పప్పు, అక్రోట్స్ లాంటి నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.
దానిమ్మ, అవకాడో వంటి పండ్లు లైంగిక వాంఛను పెంచడంలో బాగా సహాయపడతాయి.పురుషులు ఈ పండ్లను డైలీ డైట్‌లో చేర్చుకుంటే లైంగిక శక్తి పెరగడమే కాదు.లైంగిక సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
ఇక వీటితో పాటు డార్క్ చాక్లెట్స్, పప్పు ధాన్యాలు, గుడ్లు, కొబ్బరి నీళ్లు, చిలగడ దుంపలు, అల్లం, వెల్లుల్లి, యాలకులు, దాల్చిన చెక్క, పుచ్చకాయ, అరటి పండు, బ్లూ బెర్రీ పండ్లు, మూనక్కాయలు వంటి ఆహారాలు కూడా ఆరోగ్యాన్ని మరియు లైంగిక ఆరోగ్యానికి మెరుగు పరుస్తాయి.