సాధారణంగా చాలా మందికి తమ ముఖ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనే కోరిక ఉంటుంది.ఇందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.
తెలిసిన చిట్కాలను పాటిస్తుంటారు.ఖరీదైన చర్మ ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ ఫేస్ క్రీమ్( Homemade face cream ) మీకు చాలా బాగా సహాయపడుతుంది.ఈ ఫేస్ క్రీమ్ ను రోజూ వాడితే వద్దన్నా కూడా మీ చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు లేదా మూడు గులాబీ పువ్వుల రేకులు వేసుకోవాలి.అలాగే పావు కప్పు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.
అలాగే మూడు టేబుల్ స్పూన్లు రోజ్ జ్యూస్, ( Rose juice )హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ ( Vitamin E oil )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.స్పూన్ తో ఐదు నిమిషాలు కలిపితే మంచి క్రీమ్ సిద్ధమవుతుంది.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న క్రీమ్ ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ప్రతిరోజు నైట్ కనుక ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీ చర్మం తెల్లగా మారుతుంది.
ముడతలు ఏమైనా ఉంటే మాయం అవుతాయి.స్కిన్ గ్లోయింగ్ గా, షైనీగా మెరుస్తుంది.
హైడ్రేటెడ్ గా ఉంటుంది.స్కిన్ టోన్ ను మెరుగు పరుచుకోవాలని భావించే వారికి ఈ క్రీమ్ చాలా అంటే చాలా హెల్ప్ ఫుల్ అవుతుంది.
కాబట్టి తప్పక ట్రై చేయండి.