చెవి నొప్పి.సర్వ సాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.ముఖ్యంగా చిన్న పిల్లల్లో చెవి నొప్పి ఎక్కువగా వస్తుంటుంది.చెవిల్లోకి నీళ్లు వెళ్లడం, ఇయర్ బడ్స్‌తో తరచూ తిప్పడం, చల్ల గాలి, ఇన్ఫెక్షన్ ఏర్పడటం, గంటలు తరబడి ఇయర్ ఫోన్స్‌ను వాడటం వంటి రకరకాల కారణాల వల్ల చెవి నొప్పి వస్తుంటుంది.
మీ పిల్లులు కూడా చెవి నొప్పి అంటూ బాధపడుతున్నారా.? అయితే అస్సలు టెన్షన్ పడకుండా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలా సులభంగా మరియు వేగంగా పిల్లల్లో చెవి నొప్పి సమస్యను దూరం చేయవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.
చెవి నొప్పికి చెక్ పెట్టడంలో వెల్లుల్లి అద్భుతంగా సహాయపడుతుంది.
వెల్లుల్లిలో ఉండే యాంటీ బయాటిక్ లక్షణాలు చెవిలో ఏర్పడిన ఇన్ఫెక్షన్‌ను సైతం నిరోధిస్తాయి.అందుకోసం నాలుగు పొట్టు తొలగించిన వెల్లుల్లి రెబ్బలను స్లైట్‌గా దంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఆరేడు టేబుల్ స్పూన్ల ఆవ నూనె, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేడి చేయాలి.ఇలా వేడి చేసిన నూనెను స్టైనర్ సాయంతో సపరేట్ చేసి గోరు వెచ్చగా అయ్యాక రెండు, మూడు చుక్కల చప్పున పిల్లల చేవిలో వేయాలి.
ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే చెవి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ తోనూ పిల్లల్లో చెవి నొప్పిని దూరం చేయవచ్చు.అందుకోసం ఒక బౌల్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్, రెండు టేబుల్ స్పూన్ల వాటర్ వేసి బాగా కలిపాలి.ఇప్పుడు ఇందులో ఓ కాటన్ బాల్‌ను ముంచి.
దాన్ని చెవిలో పెట్టాలి.నాలుగైదు నిమిషాల తర్వాత కాటన్ బాల్‌ను తొలగిస్తే పిల్లలు చెవి నొప్పి నుండి వేగంగా బయటపడతారు.