ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్( Viral Video ) అవుతోంది.ఈ వీడియోలో ఒక దారుణమైన దాడి జరిగింది.
మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ హిందీ యూనివర్సిటీలో( Mahatma Gandhi International Hindi University ) సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వ్యక్తి సుధీర్ ఖర్ఖటే( Sudhir Kharkate ) రుచికా థాకరే( Ruchika Thakare ) అనే యువతిపై దాడి చేశాడు.ఈ షాకింగ్ ఘటన మొత్తం వీడియోలో రికార్డ్ అయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బైక్ రైడర్, ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన రుచికా తన బైక్‌పై ఉండగా, సుధీర్ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
రుచికా కిందపడిపోయింది.ఆ తర్వాత సుధీర్, అతని భార్య కారు దిగి, ఆమెకు సాయం చేయాల్సింది పోయి, ఆమెపై విరుచుకుపడ్డారు.
రక్షకుడిగా ఉండాల్సిన సుధీర్ ఆ యువతిపై ఇష్టం వచ్చినట్లు చేయి తీసుకున్నాడు అతడు విచక్షణ రహితంగా కొట్టడంతో ఆమె నోటి నుంచి రక్తం వచ్చింది.అంతేకాదు, కారును ఆమె కాళ్లపై నుంచి పోనిచ్చారని అక్కడున్న వారు చెప్తున్నారు.
ఈ దారుణాన్ని అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది.వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.“ఈ వీడియో చూస్తుంటే రక్తం మరిగిపోతుంది, ఇంత దారుణమా.సుధీర్ ఖర్ఖటేను వెంటనే సస్పెండ్ చేయాలి” అంటూ ఒక యూజర్ కామెంట్ చేశారు.“సెక్యూరిటీ ఆఫీసరే( Security Officer ) ఇలా ప్రవర్తిస్తే ఇంకేం చెప్పాలి? వాడిని, వాడి భార్యను వెంటనే అరెస్ట్ చేయండి.” అని ఇంకో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ దాడికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.సుధీర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు.సోషల్ మీడియాలోనూ ఇదే డిమాండ్ ఊపందుకుంది.
#SuspendSudhirKharkate, #JusticeForRuchika వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
ఈ వీడియో ఇప్పటికే మిలియన్ వ్యూస్‌ను దాటింది.
దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఘటనపై స్పందిస్తున్నారు.ప్రజాందోళనలు మిన్నంటుతున్నా, యూనివర్సిటీ యాజమాన్యం మాత్రం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
అధికారంలో ఉన్నవాళ్లే ఇలా ప్రవర్తిస్తే ఇక సామాన్యులకు దిక్కెవరు? సుధీర్ ఖర్ఖటేను వెంటనే సస్పెండ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.యూనివర్సిటీ యాజమాన్యం ఏం చేస్తుందో చూడాలి మరి.