ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన దేవర( Devara ) మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా థియేటర్లలో ఏకంగా 500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం.దేవర1 సినిమాకు ఆశించిన టాక్ రాకపోయినా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా అద్భుతాలు చేసింది.అయితే పుష్పరాజ్ బాటలోనే ఎన్టీఆర్( NTR ) దేవర2( Devara 2 ) మూవీ ఉండనుందని తెలుస్తోంది.
దేవర1 సినిమాలో ఎన్నో చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరకలేదు.దేవర సీక్వెల్ ఎప్పుడు తెరకెక్కినా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.పుష్ప2( Pushpa 2 ) మూవీ ఏకంగా 1800 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిన నేపథ్యంలో దేవర2 మూవీ ఏకంగా 1000 కోట్ల రూపాయల మార్కును కచ్చితంగా అందుకుంటుందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
దేవర2 బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు, సంచలన రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.దేవర2 సినిమా కథనం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ సినిమా సృష్టించే సంచలనాలు మామూలుగా ఉండవు.దేవర2 సినిమా కోసం ఫ్యాన్స్ సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయేమో చూడాలి.
నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాగా బుల్లితెరపై ఈ సినిమా ఎప్పుడు ప్రసారం అవుతుందో చూడాల్సి ఉంది.దేవర2 సినిమా బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాలి.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా వరుస విజయాలు తారక్ కు దక్కితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.