అతిలోక సుందరి శ్రీదేవి( Sridevi ).ఈమె పేరు చెప్తే ఇప్పటికి ఆమెను ఆరాధ్య దేవతగా పూజించేవారు కాసేపు బాధ పడతారు.
అంతటి అందాల రాశి ఈ రోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం.అయితే శ్రీదేవి కన్ను మూసే వరకు కూడా ఎప్పుడు ఎదో ఒక సమస్యతోనే బ్రతికింది అనేది మాత్రం నిజం.
మద్రాసులో పుట్టిన శ్రీదేవి తన తల్లి రెండో పెళ్లి వాడిని చేసుకోవడం తో కుటుంబాన్ని ఆర్థికంగా ఎప్పుడు అండగా ఉండాల్సి వచ్చింది.చిన్న తనం నుంచి నటించడం మొదలు పెట్టి తన డబ్బును ఎప్పుడు ఎవరో ఒకరి కోసం ఇస్తూనే వచ్చింది.

మొదట్లో తల్లి, ఆ తర్వాత సొంత చెల్లి తో గొడవలు, ఆ తర్వాత ప్రేమలో విఫలం చివరికి బోనీ తో( Boney Kapoor ) పెళ్లి.ఇలా అంటిలో ఆమె వివాదాలను ఎదుర్కొంది.బోనీ కి చివరికి ప్రొడ్యూసర్ గా ఫెయిల్ అయినా కూడా ఆమె సినిమాలు తీసి అతడిని ఆదుకుంది.కూతుళ్లను హీరోయిన్స్ గా చూడాలి అనుకుంది కానీ అది నెరవేరక ముందే శ్రీదేవి కన్ను మూసింది.

అయితే ఆమె చిన్న తనంలో జరిగిన సంఘటన ఎప్పుడు గుర్తు తెచ్చుకునేది శ్రీదేవి.భలే తమ్ముడు సినిమాలో( Bhale Tammudu movie ) చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన శ్రీదేవి ఆ సినిమాలో ఒక రన్నింగ్ షాట్ చేయాల్సి ఉంది.మద్రాసులోని మౌంట్ రోడ్ లో అవతలి వైపు శ్రీదేవి ఉండగా ఇవతల వైపు కె ఎస్ ప్రకాష్ రావు కొడుకు అయినా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ( Raghavendra Rao )సన్నివేశాన్ని తీస్తున్నారు.

కర్చీఫ్ చుపించగానే పరిగెత్తుకుని రమ్మని చెప్పగానే శ్రీదేవి ఎటు వైపు చూడకుండా పరిగెత్తుకుంటూ వచ్చింది.కానీ రోడ్ కి మరొక పక్క స్పీడ్ గా వచ్చిన కారు దాదాపు శ్రీదేవి ని గుద్దేసింది.కానీ కాలు చివర కారు తాకడం తో ప్రాణాపాయం తప్పింది.
ఇప్పట్లో లాగ అంత టెక్నాలజీ లేకపోవడం తో అప్పుడు ఆలా తీయాల్సి వచ్చిందట.కానీ ఆ సీన్ తర్వాత శ్రీదేవి స్పృహ కోల్పోయింది.
రాఘవేంద్ర రావు తన చేతుల మీదుగా ఎత్తుకొని పరిగెత్తుకుంటూ తీసుకెళ్లి ఆమె ఇంట్లో పడుకోబెట్టి వైద్యం చేయించాడట.ఆలా ఒక్క సెకండ్ లో ఆమె ప్రాణం పోయేది ఆ రోజు.
ఆ ప్రమాదం గుర్తచ్చినప్పుడల్లా తనకు వణుకు వస్తుంది అనే చెప్పేవారు శ్రీదేవి.