బాలయ్య బాబు గారికి ఎందుకు ఇంత వంద రోజుల పిచ్చి

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హీరో గా నటించిన వీర సింహారెడ్డి ( Veera Simha Reddy )చిత్రం ఈ సంవత్సరం ప్రారంభం లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.సినిమా కు పాజిటివ్ టాక్ లభించి మంచి కలెక్షన్స్ నమోదు అయ్యాయి.

 Balakrishna Veerasimha Reddy 100 Dyas Event ,balakrishna , Veerasimha Reddy ,-TeluguStop.com

బాలకృష్ణ గత చిత్రం అఖండ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సొంతం చేసుకున్న బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో 100 రోజుల వేడుకను( 100 days celebration ) జరుపుకుంటున్నాడు.

Telugu Balakrishna, Hindupur, Telugu, Veera Simha, Veerasimhareddy-Movie

నందమూరి అభిమానులకు పండగ వాతావరణం పంచే విధంగా బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా యొక్క వంద రోజుల వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇప్పటి వరకు వేడుక జరిగే వేదికను నిర్ణయించలేదు, కానీ అతి త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి.ఆకట్టుకునే విధంగా వీర సింహా రెడ్డి ఉంది అనడంలో సందేహం లేదు.అయితే వంద రోజులు ఆడిందా ఆడించారా అనేది మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ఈ మధ్య కాలంలో ఒక సినిమా నాలుగు వారాలు ఆడింది అంటే చాలా గొప్ప విషయం.అలాంటిది వంద రోజులు సినిమా థియేటర్లలో ఆడింది అంటే ఏ ఒక్కరు నమ్మే పరిస్థితి లేదు.

ముఖ్యంగా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిన తర్వాత కూడా థియేటర్లలో స్క్రీనింగ్ అవడం ను ఏ ఒక్కరూ పట్టించుకునే పరిస్థితి లేదు.అయినా కూడా నందమూరి బాలకృష్ణ కోసం చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ ఎత్తున 100 రోజుల వేడుక ను నిర్వహించేందుకు గాను ఏర్పాటు చేస్తున్నారు.

అని అనుకున్నట్లుగా జరిగితే హిందూపూర్ లో సినిమా యొక్క వంద రోజులు వేడుక జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Telugu Balakrishna, Hindupur, Telugu, Veera Simha, Veerasimhareddy-Movie

అతి త్వరలోనే ఆ విషయమే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.బాలకృష్ణ గత చిత్రం అఖండకి కూడా భారీ ఎత్తున 100 రోజుల వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ రోజుల్లో వంద రోజుల వేడుకలు నిర్వహించేది కేవలం బాలకృష్ణ మాత్రమే అంటూ కొందరు ఎద్దేవా చేస్తుంటే నందమూరి ఫ్యాన్స్ మాత్రం తమ హీరోకి ఆ ఘనత దక్కుతుంది అంటూ జబ్బలు చర్చుకుంటున్నారు.

మొత్తానికి బాలకృష్ణ వీరసింహారెడ్డి వంద రోజుల వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube