ఇటీవల రోజుల్లో థైరాయిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.ఒక్కసారి థైరాయిడ్ బారిన పడ్డారంటే జీవితకాలం మందులు వాడాల్సి ఉంటుంది.
కానీ థైరాయిడ్ ను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య నుంచి సులభంగా బయటపడొచ్చు.మరి ఇంతకీ థైరాయిడ్ ను ఎలా గుర్తించాలి.? దాని బారిన పడితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి.? అసలు లక్షణాలు కనిపించిన తర్వాత ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
థైరాయిడ్ లో రెండు రకాలు ఉన్నాయి.
హైపర్ థైరాయిడిజం ఒకటి కాగా.మరొకటి హైపో థైరాయిడిజం.
నెలసరి క్రమం తప్పడం, జుట్టు విపరీతంగా రాలడం, ఆకలి లేకపోవడం, బరువు పెరగడం, త్వరగా అలసిపోవడం, మలబద్ధకం, చర్మం పొడిగా మారడం, చలికి తట్టుకోలేక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే హైపో థైరాయిడిజం గా గుర్తించాలి.

అలాగే నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఒత్తిడి, విపరీతమైన చెమటలు, ఎక్కువ సార్లు మలవిసర్జన కు వెళ్లాల్సి రావడం, బాగా తింటున్నా సరే బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు హైపర్ థైరాయిడిజం ను సూచిస్తాయి.ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకుని మందులు వాడాలి.అలాగే రెగ్యులర్ గా కనీసం గంట పాటు వాకింగ్ లేదా ఇతర వ్యాయామాలను చేయాలి.
రోజుకు కనీసం మూడు లీటర్ల వాటర్ ను తీసుకోవాలి.

వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ ను ఎంచుకోవాలి.సీజనల్ గా దొరికే అన్ని పండ్లు డైట్ లో చేర్చుకోవాలి.మాంసం కాకుండా చేపలు ఎక్కువగా తీసుకునేందుకు ప్రయత్నించాలి.
చక్కెర, చక్కెరతో తయారు చేసిన ఆహారాలు, శీతల పానీయాలను పూర్తిగా అవాయిడ్ చేయాలి.ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్, జంక్ ఫుడ్స్ ను దూరం పెట్టాలి.
విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.మసాలా మరియు వేయించిన ఆహారాలకు వీలైనంతవరకు దూరంగా ఉండాలి.
థైరాయిడ్ ను ముందే గుర్తించి ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్యను సులభంగా నివారించుకోవచ్చు.
