ఈ మూడు రకాల గింజలు డైట్ లో ఉంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు.. తెలుసా?

ఇటీవల కాలంలో అధిక బరువు అనేది చాలా మందికి అతి పెద్ద సమస్యగా మారిపోయింది.ఓవర్ వెయిట్ తో ఎంద‌రో మానసికంగా శారీరకంగా కృంగిపోతున్నారు.

 This Three Types Of Seeds Help To Weight Loss Very Effectively , Weight Loss,-TeluguStop.com

ఈ క్రమంలోనే వెయిట్ లాస్ అయ్యేందుకు కఠినమైన డైట్ ను ఫాలో అవ్వడమే కాకుండా నిత్యం వర్కౌట్లు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల గింజలను డైట్ లో చేర్చుకోండి.ఈజీగా మ‌రియు ఫాస్ట్ గా వెయిట్ లాస్ ( weight loss )అవ్వ‌డానికి ఈ గింజ‌లు గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.

మరి ఇంతకీ ఆ మూడు రకాల గింజలు ఏంటో ఓ చూపు చూసేయండి.

Telugu Flax Seeds, Tips, Hemp Seeds, Latest, Seeds, Sesame Seeds-Telugu Health

జనపనార గింజలు.( Hemp Seeds ).వీటినే హెంప్ సీడ్స్ అని అంటారు.ఈ జనపనార గింజల్లో ప్రోటీన్ రిచ్ గా ఉంటుంది.అలాగే ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా నిండి ఉంటాయి.రోజుకు ఒక స్పూన్ జనపనార గింజలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.ముఖ్యంగా వెయిట్ లాస్ ( weight loss )కు అద్భుతంగా ఈ గింజలు తోడ్పడతాయి.

అతి ఆకలిని దూరం చేస్తాయి.ఎక్కువ సమయం పాటు శరీరాన్ని ఎనర్జిటిక్ గా ఉంచుతాయి.

చిరు తిండ్లపై మనసు మళ్లకుండా చేస్తాయి.ఈ గింజలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వ‌డ‌మే కాదు బ్రెయిన్ సూపర్ షార్ప్ గా సైతం పనిచేస్తుంది.

అలాగే బ‌రువు త‌గ్గ‌డానికి ప్రయత్నిస్తున్న వారు అవిసె గింజలను ( Flax seeds )ఆహారంలో భాగం చేసుకోండి.అవిసె గింజల్లో ఫైబర్ తో సహా అనేక పోషకాలు నిండి ఉంటాయి.

రోజుకు రెండు స్పూన్లు అవిసె గింజలు తింటే చాలా త్వరగా బరువు తగ్గుతారు.అదే స‌మ‌యంలో కొలెస్ట్రాల్‌ కరుగుతుంది.

గుండె జ‌బ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడే లక్షణాలు కూడా అవిసె గింజలకు ఉన్నాయి.

Telugu Flax Seeds, Tips, Hemp Seeds, Latest, Seeds, Sesame Seeds-Telugu Health

ఇక వెయిట్ లాస్ కు తోడ్పడే అద్భుతమైన సీడ్స్ లో నువ్వులు ( Sesame seeds )ఒకటి.చూడటానికి చిన్నగా కనిపించిన నువ్వుల్లో అపారమైన పోషకాలు నిండి ఉంటాయి.రోజుకు రెండు స్పూన్లు నువ్వులు తీసుకుంటే బాడీలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరుగుతుంది.క్యాలరీలు వేగంగా బర్న్ అవుతాయి.ఫలితంగా బరువు తగ్గుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube