ముఖ్యంగా చెప్పాలంటే నిమ్మకాయ( Lemon ) మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దాదాపు చాలా మందికి తెలుసు.అయితే మారుతున్న సీజన్లలో దీని వినియోగం ఎంతో ఉపయోగపడుతుంది.
ఇంకా చెప్పాలంటే చలి కాలంలో( Winter ) వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.దీని వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతూ ఉంటాయి.
ఈ సందర్భంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సీజన్ మారుతున్నప్పుడు నిమ్మకాయలను తీసుకోవడం ఎంతో మంచిది.అలాగే నిమ్మకాయలో విటమిన్ సి( Vitamin C ) ఎక్కువగా ఉంటుంది.
ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.మారుతున్న సిజన్ లలో శరీరానికి విటమిన్ సి ఆహారం కూడా పెరుగుతుంది.

ఎందుకంటే ఇది శరీరం యొక్క రోగనిరోధక శక్తిని( Immunity Power ) మెరుగుపరుస్తుంది.ఈ సీజన్ లో నిమ్మకాయలను తీసుకుంటే రోగాలు చాలా వరకు తగ్గుతాయి.అయితే విటమిన్ సి తో పాటు నిమ్మకాయలో విటమిన్ ఏ కూడా ఉంటుంది.ఇది మన కళ్ళకు( Eyes ) ఎంతో ముఖ్యం అని చాలా మంది నిపుణులు చెబుతున్నారు.
ఇవి కళ్ళకు అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి.ఇది కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది.
కాబట్టి మారుతున్న కాలంలో నిమ్మ కాయని తీసుకోవడం వల్ల కళ్లకు ఎంతో మేలు జరుగుతుంది.

ఇది గుండె ఆరోగ్యానికి( Heart ) కూడా ఎంతో మేలు చేస్తుంది.అలాగే ఇందులో ఉండే పొటాషియం సహాయంతో అధిక రక్తపోటును నియంత్రించవచ్చు.అదనంగా నిమ్మకాయలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది.
ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.అయితే నిమ్మకాయను ఎక్కువగా తినకూడదని గుర్తు పెట్టుకోవాలి.
ఎందుకంటే ఇందులో ఉండే అధిక విటమిన్ సి కడుపులో సమస్యలను కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కాబట్టి ఏ ఆహారాన్ని అయినా తగిన మోతాదులో తీసుకోవడమే మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు.