దీపావళి పండుగ వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటో మీకు తెలుసా..

దీపావళి అంటే దీపాల పండుగ అని చాలామందికి తెలిసిన విషయమే.అయితే దీపావళి పండుగను చెడు పై మంచి విజయం సాధించిందని జరుపుకుంటారు.

 Do You Know The Real History Behind The Festival Of Diwali , Ashvayuja Amavasya,-TeluguStop.com

నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు ఆ మరుసటి రోజు ప్రజలు ఎంతో ఆనందంగా దీపావళి పండుగను జరుపుకున్నారని పురాణాలలో ఉంది.ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది.

దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి.దీన్ని నరక చతుర్థశిగా అని కూడా అంటారు.

దీపావళి రోజున దీపారాధన, లక్ష్మీ పూజ కూడా చేస్తారు.

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు.

ఈ దీపాలంకరణ మనోవికాసానికి, ఆనందానికి,సంపదలకు నిదర్శనంగా చెబుతారు.మహాలక్ష్మి పూజ ఎందుకు చేయాలంటే,దుర్వాస మహర్షి ఒకరోజు దేవేంద్రుని ఆతిథ్యానికి వెళ్లి ఓ హారాన్నిస్తాడు.

ఆ హారాన్ని తిరస్కరించిన ఇంద్రుడు తన ఏనుగు మెడలో వేస్తే, ఆ ఏనుగు ఆ హారాన్ని కాలితో తొక్కుతుంది.అసలే దుర్వాసుడికి కోపం ఎక్కువ ఇదంతా చూసి కోపంతో రగిలిపోయిన మహర్షి దేవేంద్రుడిని శపించాడు.

ఆ శాప పలితంగా తన స్థానాన్ని, సర్వసంపదలను కోల్పోతాడు.దిక్కుతోచని స్థితిలో శ్రీమహావిష్ణువుని ప్రార్థిస్తే, కరుణిగించిన శ్రీ మహావిష్ణువు,ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని చెబుతాడు.

ఇంద్రుడు అలా చేసిన తర్వాత పోయిన సరిసింపదలు మళ్లీ వచ్చాయని పురాణాలలో ఉంది.అప్పటి నుంచి లక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వసంపదలూ కలుగుతాయని వేద పండితులు చెబుతారు.

దీపావళి పండుగను ప్రజలు ఎందుకు జరుపుకుంటారంటే రావణ సంహారం అనంతరం సతీసమేతంగా అయోధ్యకు శ్రీరాముడు చేరుకున్నాడు .అందుకే దసరాకి రావణ దహనం కార్యక్రమం చేస్తారు.దసరా అనంతరం వచ్చే పండుగ దీపావళి.రావణ సంహారం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు చేరుకోవడంతో ప్రజలంతా దీపాలు వెలిగించి, శ్రీరాముని ఆహ్వానించినట్లు దీపావళి పండుగను చేసుకుంటారు.

History and Significance of Diwali

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube