Harish Rao KTR : అసెంబ్లీలో కాంగ్రెస్ ఆరోపణలను హరీష్ రావు ఎదుర్కొన్న విధానం పై కేటీఆర్ పొగడ్తలు..!!

తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలలో సోమవారం సాగునీటి ప్రాజెక్టులపై వాడి వేడి చర్చ జరిగింది.ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులూ వర్సెస్ హరీష్ రావు( Harish Rao ) మధ్య మాటల యుద్ధం వాడి వేడిగా జరిగింది.

 Ktr Compliments Harish Rao On The Way He Faced Congress Allegations In The Asse-TeluguStop.com

కాంగ్రెస్ నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి తీవ్రస్థాయిలో బీఆర్ఎస్( BRS ) అధికారంలో తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు చేయడం జరిగింది.కాంగ్రెస్ నాయకులు చేసిన విమర్శలపై హరీష్ రావు ధీటుగా స్పందించారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం తమకి అవకాశం ఇవ్వాలని కోరారు.పీపీటీ ద్వారా తాము కూడా వాస్తవాలను సభ ముందుకు తీసుకొస్తామని పేర్కొన్నారు.

నల్గొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని చెప్పుతో కొట్టినట్లు అంటూ మంత్రి కోమటిరెడ్డి ( Komatireddy )చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నీ చెప్పుతో కొట్టినట్లయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi )ని కూడా అమేధీలో చెప్పుతో కొట్టినట్లేనని కౌంటర్ ఇచ్చారు.నల్లగొండలో బీఆర్ఎస్ సభ పెడుతున్నందుకే… ప్రభుత్వం ప్రాజెక్టులను కేఆర్ఏంబీ ( KRMB )ఇవ్వటం లేదని తీర్మానం చేసిందని వ్యాఖ్యానించారు.కృష్ణానది జలాల విషయంలో అసెంబ్లీలో చర్చ సందర్భంగా హరీష్ రావు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పొగడ్తలతో ముంచేత్తారు.“ఈరోజు అసెంబ్లీలో అద్భుతమైన ప్రదర్శనతో ఒంటిచేత్తో హరీష్ రావు అర్థరహితమైన సీఎం మరియు క్యాబినెట్ మంత్రుల తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టారని వ్యాఖ్యానించారు.కృష్ణానది జిల్లాలు కేఆర్ఎంబికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేశారని.

ఆ ప్రచారాలకు దీటైన కౌంటర్లు ఇచ్చారు.రేపటి ఛలో నల్గొండ కార్యక్రమానికి సిద్ధం కండి.

అక్కడ కేసీఆర్ తనదైన శైలిలో దుష్ప్రచారాన్ని తిప్పి కొడతారు” అంటూ ట్విట్టర్ లో కేటీఆర్ ట్విట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube