సూర్యాపేట జిల్లా:నర్సింగ్ ఆఫీసర్( Nursing Officer ) మంజులపై సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలని తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శివ సాయికృష్ణ ( Shiva Saikrishna )అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిరసన వ్యక్తపరిచారు అనంతరం మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంజుల జాయినై మూడు రోజులు మాత్రమేనని, రిలీవర్ గా మాత్రమే ఆమె డ్యూటీ చేసిందని,దానికి బాధ్యత వహించాల్సిన శానిటేషన్,పేస్ట్ కంట్రోల్ సిబ్బందిని వదిలి డాక్టర్, నర్స్ పై చర్యలు తీసుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంజుల సస్పెన్షన్ వేటును వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.ప్రభుత్వం వెంటనే ఆమెని ఉద్యోగంలోకి తీసుకోని డ్యూటీని యధావిధిగా కొనసాగించాలని కోరారు.
ఐసీయూలో ఉన్న పేషంట్ కి ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరమైన చర్య అన్నారు.ఈ కార్యక్రమంలో స్టేట్ జనరల్ కోశాధికారి నరేష్,సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు కొండల నాయక్( Kondala Nayak ),జిల్లా జనరల్ సెక్రెటరీ నాగరాజు,ఉపేంద్ర కన్వీనర్ సుజిత్,వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్,శోభ శ్రీనివాస్ డిప్యూటీ నర్సింగ్ ఆఫీసర్ వరమ్మ,రేణుక తదితరులు పాల్గొన్నారు.