సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో జనగాం క్రాస్ రోడ్ వద్ద ఆదివారం హోప్ స్వచ్ఛంద సేవా సమితి మరియు సింధు ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు దైద వెంకన్న ఆధ్వర్యంలో “కాలుష్యాన్ని నిర్మూలిద్దాం-పర్యావరణని రక్షించుకుందాం”అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన పర్యావరణ ప్రేమికులు,సామాజిక సేవకులు, లంక సేవా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు “లంక కొండయ్య” ముఖ్యఅతిథిగా హాజరై “మొక్కలను నాటుదాం-పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం”అనే వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మనమందరం విరివిగా మొక్కలు నాటి ఊరంతా పచ్చదనంతో నింపాలని,పర్యావరణాన్ని పరిరక్షించి,కాలుష్యాన్ని నివారిద్దామని పిలుపునిచ్చారు.టిఆర్ఎస్ జిల్లా నాయకులు బైరు వెంకన్న గౌడ్ మరియు దైద వెంకన్నలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం యుద్ధప్రాతిపదికన నిర్వహించి,తెలంగాణ రాష్ట్రంలో 33 శాతాన్ని అడవులను సృష్టించాలని కోరారు.
భవిష్యత్ తరాలకు ఆస్తులు,అంతస్తులు,సంపదలు కాకుండా విరివిగా మొక్కలను నాటి ప్రాణ వాయువును అందించాలన్నారు.అనంతరం వాల్ పోస్టర్ లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నవిలే వెంకన్న, పగడాల కృష్ణారెడ్డి,చారి,మహాజన్ రమేష్,శ్రీనివాస్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.