సూర్యాపేట జిల్లా: హలో… నేను ఫలానా పోలీస్ స్టేషన్ నుండి ఎస్ఐను మాట్లాడుతున్న…బంగారం దొంగలు దొరికారు.దొంగిలించిన బంగారం మీ షాపులో అమ్మినట్లు ఒప్పుకున్నారు.
బంగారం రికవరీ చేయాలి.మీరు రూ.లక్ష పంపిస్తే ఏం లేదు, లేదంటే కేసు కట్టి జైలుకు పంపించాల్సి ఉంటుందని గూగుల్ మ్యాప్ ద్వారా బంగారం షాపులను గుర్తించి యజమానులను
టార్గెట్ చేసి బెదిరిస్తూ గత సంవత్సర కాలంగా వసూళ్లకు పాల్పడుతున్న నల్లగొండ జిల్లాకు చెందిన నలుగురు నకిలీ ఎస్ఐల బండారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పోలీసులు శనివారం సాయంత్రం బట్టబయలు చేశారు.వారి వద్ద నుండి రెండు ద్విచక్ర వాహనాలు,నాలుగు సెల్ ఫోన్లు,రూ.24,900 నగదు స్వాధీనం చేసుకుని,కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు హుజూర్ నగర్ సిఐ చరమందరాజు, ఎస్ఐ ముత్తయ్య తెలిపారు.