సూర్యాపేట జిల్లా:మహనీయుడు డా.బిఆర్.
అంబేద్కర్ జయంతి రోజున భూ సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నూతనగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం రైతులకు చుట్టం లాంటిదని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.
శుక్రవారం సూర్యాపేట జిల్లా మునగాల మండలకేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డీఓ సూర్యనారాయణ,ఎమ్మార్వో ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.