రైతుకు మద్దతుగా నిలిస్తే అక్రమ కేసులు పెడతారా?

సూర్యాపేట జిల్లా:రైతు పండించిన పంటను కొనుగోలు చేయాలని,గిట్టుబాటు ధర కల్పించాలని,రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా పోరాటాలు చేస్తే అక్రమ కేసులు పెడతారా అని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జి ధర్మార్జున్ ప్రశ్నించారు.శుక్రవారం చివ్వెంల పోలీస్ స్టేషన్లో బైండోవర్ అయిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత వానాకాలం వరిధాన్యం కొనుగోలు చేయాలని జరిగిన పోరాటంలో పాల్గొన్న వారిపై అక్రమకేసులు బనాయించి,ఇప్పుడు ఆకేసులో తనతో పాటు ఇతర సంఘాల నాయకులను చివ్వెంల పోలీస్ స్టేషన్ కు పిలిచి 41 సి.

 If You Stand In Support Of The Farmer, Will You File Illegal Cases?-TeluguStop.com

ఆర్.పీ.సి.నోటీసులు ఇస్తున్నారని,ఇది టీఆర్ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనం అన్నారు.తమ రాజకీయ డ్రామాలో భాగంగా రాస్తారోకోలు చేసిన టీఆర్ఎస్ నాయకుల మీద ఎలాంటి కేసులు లేకుండా ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడం పాలకుల ద్వంద ప్రమాణాలకు నిదర్శనమన్నారు.రైతు ఉద్యమంలో బనాయించిన అక్రమ కేసులన్ని ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube