సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ శ్రీనగర్ కాలనీలో ఓ షాపు వద్ద క్యాంపా కూల్ డ్రింక్ కొనుగోలు చేసి తాగిన పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.విషయం తెలుసుకున్న పేరెంట్స్ షాపు దగ్గరికి వెళ్ళి విచారించగా బాటిల్ పై ఏటువంటి నిర్ధారణ తేదీ లేకపోవడంతో షాపు యజమాని సమక్షంలో మళ్ళీ అదే డ్రింక్ తాగగా
మరోసారి అవస్థతకు గురికావడంతో పిల్లలను హుజూర్ నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించి,డాక్టర్ సలహా మేరకు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు.
పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న షాపు యజమానిపై మరియు హుజుర్ నగర్ డిస్ట్రిబ్యూటర్ పై కేసు నమోదు చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు.







