సూర్యాపేట జిల్లా: మునగాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన దేశగాని వెంకటేశం తాటిచెట్టుపైన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది.ఈ క్రమంలో మృతదేహన్ని కిందికి దించేందుకు స్థానికులు ఏర్పాట్లు చేశారు.
చెట్టుపైకి ఒక వ్యక్తి ఎక్కి ఉరి వేసుకున్న తాడును తీసే క్రమంలో సహాయం చేసేందుకు మరో వ్యక్తి పైకి ఎక్కుతుండగా మృతదేహం అతడి మీద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు.దీంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు.
గాయపడిన వ్యక్తిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.