అశ్వగంధ పాలు.. వారంలో రెండు సార్లు తీసుకున్న మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు!

అశ్వగంధ.దీని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.ఇది ఒక పురాతన మూలిక.ఆయుర్వేద వైద్యంలో అత్యంత శక్తివంతమైన వేరుగా అశ్వగంధ చెప్పబడింది.అశ్వగంధ ఎన్నో రోగాలకు సహజసిద్ధమైన మెడిసిన్ లా పని చేస్తుంది.అందుకే అనేక రోగాల వైద్యం లో అశ్వగంధ ను వాడుతున్నారు.

 Wonderful Health Benefits Of Ashwagandha Milk! Ashwagandha Milk, Ashwagandha Mil-TeluguStop.com

అశ్వగంధ ఆరోగ్యపరంగా అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది.ముఖ్యంగా అశ్వగంధ పాలు వారంలో క‌నీసం రెండు సార్లు తీసుకున్న సరే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

మరి ఇంతకీ అశ్వగంధ పాలు ఎలా తయారు చేసుకోవాలి? వాటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి.? అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాసు పాలు, ఒక గ్లాసు నీళ్లు వేసుకోవాలి.పాలు కాస్త మరిగిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అశ్వగంధ పొడిని వేసి పాలు సగం అయ్యేంత వరకు మరిగించాలి.

Telugu Ashwagandha, Ashwagandhamilk, Tips, Latest-Telugu Health

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలు ఫిల్టర్ చేసుకోవాలి.ఈ పాలు కాస్త‌ గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.ఈ అశ్వగంధ పాలను డైట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ తగ్గుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

అశ్వగంధ పాలు తాగడం వల్ల ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు దూరమవుతాయి.మెదడు చురుగ్గా మారుతుంది.ఇటీవల రోజుల్లో గుండెపోటు బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.

Telugu Ashwagandha, Ashwagandhamilk, Tips, Latest-Telugu Health

అయితే గుండెను ప‌ది కాలాల పాటు పదిలంగా కాపాడడానికి అశ్వగంధ పాటు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.ఈ అశ్వగంధ పాలు తరచూ తీసుకుంటే కనుక రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.దాంతో గుండెపోటు తో సహా వివిధ రకాల గుండె సంబంధిత జబ్బులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

ఇక అశ్వగంధ పాలు తాగడం వల్ల నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.సంతాన సమస్యలు ఏమైనా ఉంటే తగ్గు ముఖం పడతాయి.మరియు ఎముకలు కండరాలు దృఢంగా సైతం మారతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube