సాధారణంగా కొందరికి ముఖం నిండా మొటిమలే ఉంటాయి.అవి అందాన్నే కాదు మనో ధైర్యాన్ని సైతం కోల్పోయేలా చేస్తాయి.
ఈ క్రమంలోనే మొటిమలను వదిలించుకునేందుకు, మెరిసే చర్మాన్ని పొందడానికి నానా అవస్థలు పడుతుంటారు.చర్మం పై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.
ఖరీదైన క్రీములు వాడుతుంటారు.మీరు ఈ లిస్ట్ లో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ మీకు ది బెస్ట్ వన్ గా వర్కౌట్ అవుతుంది.ఈ రెమెడీని పాటిస్తే మొటిమల్లేని మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.
మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు అరటిపండు( Banana ) స్లైసెస్ వేసుకోవాలి.అలాగే రెండు కీర దోసకాయ స్లైసెస్ మరియు మూడు నుంచి నాలుగు బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు వేసుకోవాలి.ఆపై కొంచెం రోజ్ వాటర్( Rose water ) యాడ్ చేసుకుని చాలా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై ఒక ఐస్ క్యూబ్ తో చర్మాని సున్నితంగా రబ్ చేసుకోవాలి.ఫైనల్ గా వేసుకున్న మాస్క్ ను కూల్ వాటర్ సహాయంతో తొలగించి శుభ్రంగా చర్మాన్ని తడి లేకుండా తుడుచుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ సింపుల్ హోమ్ రెమెడీని పాటించడం వల్ల చర్మంపై అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.
మొటిమలు మాయమవుతాయి.మళ్లీ మళ్లీ రాకుండా ఉంటాయి.
మొటిమల తాలూకు మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా తొలగిపోతాయి.చర్మం సూపర్ గ్లోయింగ్ గా మరియు షైనీ గా మారుతుంది.
అందంగా మెరుస్తుంది.కాబట్టి మొటిమలు లేని మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.