ఏపీకి భారీ విరాళం ప్రకటించిన మెగా డాటర్ నిహారిక.. పోస్ట్ వైరల్!

ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో వరదలు( Floods ) వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఏపీలో విజయవాడ మొత్తం నీట మునిగింది.

 Niharika Konidela Donates 5 Lakhs For Ap Floods, Niharika, Ap Floods, 50 Lakhs,-TeluguStop.com

ఇలా విజయవాడ మొత్తం వరదలలో చిక్కుకున్న నేపథ్యంలో అక్కడ వరదలలో చిక్కుకున్న వారికి సహాయం చేయడం కోసం ఎంతోమంది పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటించారు.ఇక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎంతో మంది హీరోలు కొన్ని కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.

మెగా ఫ్యామిలీలో హీరోలుగా కొనసాగుతున్న రామ్ చరణ్, చిరంజీవి ,పవన్ కళ్యాణ్ ,వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వంటి వారందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం అందించిన సంగతి తెలిసిందే.

Telugu Lakhs, Ap Floods, Chiranjeevi, Niharika, Pawan Kalyan, Tollywood, Varun T

ఇకపోతే తాజాగా నిహారిక ( Niharika ) సైతం ఏపీకి విరాళం ప్రకటించారు.ఈ సందర్భంగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు వైరల్ గా మారింది.విజయవాడలో వరద ముప్పుకి గురైన 10 గ్రామాలకు గ్రామానికి 50,000 చొప్పున ఈమె  ఐదు లక్షల విరాళం అందించినట్టు తెలిపారు.

తాను పట్టణంలోనే పుట్టి, పెరిగినా తన పెద్దవాళ్లు మాత్రం ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని తెలిపారు.ఆ అనుభవాల దృష్ట్యా గ్రామీణ వాతావరణం పై అభిమానం ఏర్పడింది.

Telugu Lakhs, Ap Floods, Chiranjeevi, Niharika, Pawan Kalyan, Tollywood, Varun T

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో పాటు తన కుటుంబీకులందరూ కూడా ఎంతో అండగా నిలిచారు  ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో నేను కూడా భాగం కావడం చాలా సంతోషంగా అనిపిస్తుందని నిహారిక సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.ఇప్పటికే ఈ కుటుంబం నుంచి కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా అందించారు  తాజాగా నిహారిక కూడా తనవంతుగా ఐదు లక్షలు విరాళం ఇవ్వడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.నిహారిక కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ద్వారా నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చి కోట్లలో లాభాలను అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube