1.తిరుమల సమాచారం
తిరుమలలో నేడు ఉదయం 9 గంటలకు శ్రీవారి వర్చువల్ సేవ టికెట్లను విడుదల చేశారు.
2.సింహాచలం దేవస్థానంలో…
నేటి నుంచి సింహాచలం దేవస్థానం లో దారోత్సవాలు ప్రారంభం కానున్నాయి.ఈనెల 13 వరకు ఆర్జిత నిత్య కళ్యాణం ను రద్దు చేశారు.
3.బిఎస్ 3,4 డీజిల్ వాహనాలపై నిషేధం
నేటి నుంచి బిఎస్3 , బి ఎస్ ఫోర్ డీజిల్ వాహనాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించారు.
4.తెలంగాణ మంత్రుల సమావేశం
నేడు జిహెచ్ఎంసి ఆఫీసులో మంత్రుల కీలక సమావేశం నిర్వహించారు.కార్పొరేటర్లు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
5.ఏపీ సీఎం జగన్ సమీక్ష
నేడు ఉదయం 11 గంటలకు శ్రీ శిశు సంక్షేమ శాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.అంగన్వాడి కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా అధికారులతో చర్చించారు.
6.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్
నేను ఉగ్రవాదిని కాదు అని, కబ్జాలు చేయలేదని తనకు సెక్యూరిటీ అవసరం లేదని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
7.సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలి
తక్షణమే తన పదవికి సోమేశ్ కుమార్ రాజీనామా చేయాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పు నేపథ్యంలో సంజయ్ ఈ డిమాండ్ చేశారు.
8. బాబు పవన్ కలిస్తే తప్పేంటి
టిడిపిలోకి కొత్త రక్తం కావాలని బాబు పవన్ కలిస్తే తప్పేమిటి అని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.
9.సోమేశ్ కుమార్ పై సిబిఐ విచారణ జరిపించాలి : రేవంత్ రెడ్డి
సిఎస్ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం అని తాము మొదటి నుంచి చెబుతున్నామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని రేవంత్ డిమాండ్ చేశారు.
10.లోకేష్ తో గంటా భేటీ
టిడిపి జాతి యొక్క ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు.దాదాపు 40 నిమిషాల పాటు వివిధ రాజకీయ అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది.
11.ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చండీయాగం
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో చండీయాగం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొన్నారు.
12.కెసిఆర్ పై రేణుక చౌదరి కామెంట్స్
తెలంగాణ సీఎం కేసీఆర్ చూస్తే జాలి కలుగుతోందని కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
13.టిడిపి మాజీ ఎమ్మెల్యే పై కేసు నమోదు
టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పై కేసు నమోదు అయింది యరపతినేని తో పాటు మరో ఐదుగురుపై పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయింది .చింతలపూడి విజయ్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పిడుగురాళ్ల స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
14.భారత్ హజ్ కోట పెంపు
భారతదేశ చరిత్రలో భారతీయ హౌస్ కోటాను సౌదీ అరేబియా భారీగా పెంచింది.1 లక్షా 75 వేల 25 మందిని అనుమతి ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
15.కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇష్యూ
కామారెడ్డి నూతన మాస్టర్ ప్లాన్ అమలను వ్యతిరేకిస్తూ 40 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై జస్టిస్ మాధవి దేవి ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ అంశంపై వివరణ ఇచ్చేందుకు అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ రావాలని ధర్మాసనం ఆదేశించింది.
16.వైద్య కళాశాలలకు ట్యూటర్ పోస్టులు
తెలంగాణలోని 14 వైద్య కళాశాలలో 21 ట్యూటర్ పోస్టులను భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతించింది.
17.ఆస్తులు విభజనపై సుప్రీం నోటీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది పది సంవత్సరాల తో పాటు చట్టంలో పేర్కొనని సంస్థల ఆస్తులు అప్పుల విభజనపై కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
18.సిఐడి చీఫ్ గా మహేష్ భగవత్
తెలంగాణ రాష్ట్ర నేర పరిశోధన విభాగం సిఐడి చీఫ్ గా మహేష్ భగవత్ బాధ్యతలు చేపట్టారు.
19.అగ్నికుల కార్పొరేషన్ కు 5 వేల కోట్లు ఇవ్వాలి
ఏపీలోని 40 లక్షల జనాభా కలిగిన అగ్నికుల క్షత్రియుల అభివృద్ధికి తక్షణమే ఐదు వేల కోట్లు విడుదల చేయాలని అగ్నికుల క్షత్రియ సంఘం రాష్ట్ర సమావేశంలో అగ్నికుల క్షత్రియ యూత్ ఫోర్సు జాతి అధ్యక్షుడు నాగిడి సాంబశివరావు డిమాండ్ చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,450 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 56,130
.