వేలంలో కొనుగోలు చేసిన రూ.52 కోట్ల విలువైన అరటిపండును తిన్న వ్యాపారవేత్త

52 కోట్ల విలువైన అరటిపండు ఆర్ట్‌వర్క్‌ను వేలానికి పెట్టినట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.ఇంత ఖరీదైన ఆర్ట్‌వర్క్‌ని(Expensive artwork) కొనుగోలు చేసిన వ్యక్తి దానిని డెకరేషన్‌ కోసం ఎక్కడో ఉపయోగించారని మీరు అనుకుంటూ ఉండవచ్చు.

 Businessman Eats Banana Worth Rs 52 Crore Bought At Auction, Banana Eat, Social-TeluguStop.com

అయితే, దాన్ని కొన్న వ్యక్తి ఏమి చేసాడో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.చైనాలో జన్మించిన క్రిప్టోకరెన్సీ (Cryptocurrency)వ్యాపారి జస్టిన్ సన్ ఈ కళాకృతిని కొనుగోలు చేశారు.హాంకాంగ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సన్ ఈ బనానా టేప్‌ని తొలగించి తిన్నాడు.52 కోట్ల విలువైన అరటిపండు తిన్న వీడియో వైరల్ అవుతోంది.వీడియోలో ఈ అరటిపండు నిజానికి ఇతర అరటిపండ్ల కంటే చాలా రుచిగా ఉందని సన్ చెప్పాడు.అరటిపండు ఈ సంభావిత కళాకృతిని మౌరిజియో కాటెలాన్(Maurizio Cattelan) తయారు చేయడం గమనార్హం.

సన్ దాని అంచనా విలువ కంటే నాలుగు రెట్లు ఎక్కువకు కొన్నాడు.అయితే దాని చెల్లింపు క్రిప్టోలో చేయబడింది.

జస్టిన్ సన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.ఇందులో ఆయన మాట్లాడుతూ.ఈ అరటిపండు రుచి ఏంటని చాలా మంది స్నేహితులు చాలాసార్లు అడిగారు.షేర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.లక్షల సంఖ్యలో వ్యూస్ రాగా.దీనిపై వేళా సంఖ్యలో పలువురు వ్యాఖ్యానించారు.

ఈ కళాకృతిని మొదటిసారిగా ఆర్ట్ బాసెల్ మయామి బీచ్‌లో 2019లో పెరోటిన్ గ్యాలరీ ప్రదర్శించింది.కళాకారుడు మౌరిజియో కాటెలాన్ దీనిని మొదట్లో మయామి కిరాణా దుకాణంలో సుమారు 30 సెంట్స్ కు కొనుగోలు చేశారు.ఇప్పుడు దాని ధర రూ.52 కోట్లకు చేరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube