వైవా హర్ష కొత్త బైక్ అన్ని లక్షలా.. ఖరీదెంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష( Comedian Viva Harsha ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రస్తుతం హర్ష బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Comedian Viva Harsha Bought Suzuki Hayabusa Sports Bike Photos Goes Viral, Viva-TeluguStop.com

సినిమాలో తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బనవిస్తూ కమెడియన్ గా బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు హర్ష.మొదట వైవా అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా వైవా హర్షగా పేరు తెచ్చుకున్నాడు.

అలా పలు సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకున్నాడు.అలాగే ఇటీవల హీరోగా కూడా పరిచయమవుతూ సుందరం మాస్టర్ ( Sundharam master )అనే సినిమా కూడా చేసాడు.

ఇది ఇలా ఉంటే తాజాగా లక్షలు విలువ చేసే ఒక స్పోర్ట్స్ బైక్ ని కొనుగోలు చేశారు వైవా హర్ష.

సుజుకి హయబుసా1300 మోడల్ బైక్ ( Suzuki Hayabusa 1300 model bike )ని కొనుగోలు చేశారు.ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఈ బైక్ ధర తెలిసి చాలామంది షాక్ అవుతున్నారు.వామ్మో అన్ని లక్షల అంటూ నోరెళ్ల బెడుతున్నారు.

కాగా ఈ బైక్ ధర దాదాపుగా 15 లక్షలు ఉంటుందని తెలుస్తోంది.ఇక ఈ బైక్ ను తన భార్య అక్షర చేతుల మీదుగా స్టార్ట్ చేయించాడు హర్ష.

అయితే ఇది తన డ్రీమ్ బైక్ కావడంతో ఈ బైక్ ను వేరే దేశం నుండి తెప్పించుకున్నాడట.అందులోనూ హర్ష బైక్ రేసింగ్ చేస్తాడు.

అందుకే ఈ బైక్స్ అంటే తనకి బాగా ఇష్టమమని తెలిపారు.ఈ మేరకు అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియో లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చాడు హర్ష.

ఒక హాఫ్ డే గ్యాప్ లో బైక్ డెలివరీ అయ్యింది.చాలా సంతోషంగా ఉంది.దీనికోసం ఎంతో ఎదురుచూసాను మీ అందరి ప్రేమ, సపోర్ట్ లేకపోతే ఇది జరిగేది కాదు.మీ అందరికీ రుణపడి ఉంటాను.థ్యాంక్ యూ అని ఆ బైక్ కి ముద్దుపెడుతూ ఎమోషనల్ అయ్యాడు.కాగా అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది అభిమానులు కంగ్రాచులేషన్స్ చెబుతుండగా మరికొందరు మాత్రం వామ్మో ఆ బైకు ద్వారా అన్ని లక్షలా, ఆ బైకు కి చిన్న సైజు కారు కూడా వచ్చేస్తుంది కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube