వయసు పెరిగే కొద్దీ ముఖంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.స్కిన్ ఏజింగ్ ప్రారంభమవుతుంది.
ముడతలు, ఫైన్ లైన్స్, చర్మం సాగటం(Wrinkles, fine lines, skin sagging) వంటివి కొట్టొచ్చినట్టు కనపడతాయి.అయితే కొందరు మాత్రం వయసు పైబడిన కూడా చాలా యవ్వనంగా కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు.
అటువంటి చర్మాన్ని మీరు కూడా పొందాలని భావిస్తున్నారా.? 40 లోనూ నవ యవ్వనంగా కనిపించాలనుకుంటున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు బొప్పాయి పండు స్లైసెస్(Papaya fruit slices), నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్(Orange juice) వేసుకొని ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, కావాలి అనుకుంటే మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.
ఆపై గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
వారానికి రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే అద్భుతం ఫలితాలు పొందుతారు.బొప్పాయిలో బీటా కెరోటిన్(Beta carotene) వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.ఎగ్ వైట్ లో ఉండే పోషకాలు స్కిన్ ఏజింగ్ ను ఆలస్యం చేస్తాయి.
అదే సమయంలో చర్మ రంధ్రాలను బిగించి, జిడ్డును సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.
ఆరెంజ్ లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడుతుంది.ఇది మీ చర్మాన్ని దృఢంగా మరియు మరింత మృదువుగా చేస్తుంది.కాబట్టి, 40లోనూ నవ యవ్వనంగా కనిపించాలనుకుంటే ఈ రెమెడీని తప్పక ట్రై చేయండి.
పైగా ఈ హోమ్ రెమెడీ మీ చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.పిగ్మెంటేషన్ మరియు డార్క్ స్పాట్‌లను తగ్గిస్తుంది.
స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.మరియు బ్లాక్ హెడ్స్ ను సైతం తొలగిస్తుంది.