సాధారణంగా సినిమాలకు నవంబర్ నెల అచ్చిరాదనే సంగతి తెలిసిందే.నవంబర్ నెలలో విడుదలై భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాలు సైతం ఎక్కువగా లేవని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
నవంబర్ నెలలో బాక్సాఫీస్ వద్ద ఎక్కువ సినిమాలు విడుదలైనా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించలేదు.నవంబర్ మొదటి వారంలో నిఖిల్(Nikhil) నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో విడుదలైంది.
ఈ సినిమా ఎప్పుడు విడుదలైందో నిఖిల్(Nikhil) అభిమానులలో సైతం చాలామందికి తెలియదు.ధూం ధాం, ఆదిపర్వం(Dhoom Dham, Adi Parva) సినిమాలు సైతం రిలీజ్ కాగా ఈ సినిమాలకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదు.
నవంబర్ రెండో వారంలో మట్కా, కంగువా(Matka, Kangua) సినిమాలు రిలీజ్ కాగా ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను నిరాశకు గురి చేశాయి.వరుణ్ తేజ్(Varun Tej) కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా మట్కా మూవీ నిలిచింది.
మూడో వారంలో మెకానిక్ రాకీ, జీబ్రా, దేవకీ నందన వాసుదేవ(Mechanic Rocky, Zebra, Devaki Nandana Vasudeva) సినిమాలు రిలీజ్ కాగా ఈ మూడు సినిమాలు వేటికవే నిరాశపరిచాయి.జీబ్రా సినిమా కొంతమంది ప్రేక్షకులకు నచ్చినా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో ఈ సినిమా ఫెయిలైంది.నవంబర్ చివరి వారంలో రోటీ కపడా రొమాన్స్, మరికొన్ని చిన్న సినిమాలు రిలీజయ్యాయి.నవంబర్ నెల సెంటిమెంట్ మరోసారి ప్రూవ్ అయిందనే చెప్పాలి.
డిసెంబర్ నెలలో విడుదల కానున్న సినిమాలలో పుష్ప ది రూల్ (Pushpa The Rule)సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాపై ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టి ఉంటుంది.పుష్ప ది రూల్ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పుష్ప ది రూల్(Pushpa The Rule) రిజల్ట్ ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది.
బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.