జుట్టు రాలడం లేదా హెయిర్.దాదాపు ప్రతి ఒక్కరిలో ఉండే కామన్ సమస్యే ఇది.కానీ, కొందరిలో మాత్రం ఈ జుట్టు రాలడం అనేది భారీగా ఉంటుంది.ఎన్ని హెయిర్ ప్యాకులు వేసుకున్నా.
ఎంత ఖరీదైన షాంపూలు, నూనెలు వాడినా.జుట్టు రాలడం తగ్గనే తగ్గనే తగ్గదు.
దాంతో ఏం చేయాలో తెలియక.ఎలా ఈ సమస్యను నివారించుకోవాలో అర్థం గాక మానసికంగా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటాయి.
అయితే అలాంటి వారికి గురివింద ఆకులు అద్భుతంగా ఉపయోగపడతాయి.

ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉండే గురివింద ఆకులు.జుట్టు రాలడాన్ని అరి కట్టి ఒత్తుగా పెరిగేలా చేస్తాయి.మరి ఇంతకీ గురివింద ఆకులను ఎలా హెయిర్‌కి వాడాలో లేట్ చేయకుండా చూసేయండి.
ముందుగా కొన్ని గురివింద చెట్టు ఆకులను సేకరించి నీటిలో కడిగి మెత్తగా నూరు కోవాలి.ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో రెండు కప్పుల నువ్వులు నూనె వేసి.
ఆపై గురివింద ఆకుల పేస్ట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని కాస్త చల్లారనిచ్చి.
ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి.ఈ నూనెను తల స్నానం చేయడానికి రెండు గంటల ముందు జుట్టు మొత్తానికి అప్లై చేసి కాసేపు మసాజ్ చేసుకోవాలి.
అనంతరం కెమికల్స్ లేని షాంపూతో హెడ్ బాత్ చేయాలి.నాలుగు రోజులకు ఒక సారి ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గి.
ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.మరియు జుట్టు తెల్ల బడటం, చిట్లడం వంటి సమస్యలు కూడా ఉండవు.

ఇక పైన చెప్పుకున్న టిప్‌తో పాటుగా మీరు చేయాల్సింది ఏంటంటే.ఎనిమిది బాదం పప్పులు, ఎనిమిది ఎండు ద్రాక్షలు తీసుకుని నీటిలో రాత్రంతా నాన బెట్టుకుని ఉదయాన్నే తీసుకోవాలి.తద్వారా జుట్టుకు మంచి పోషణ అంది రాలడం తగ్గుతుంది.