సింగపూర్‌లో( Singapore ) త్వరలో ఎన్నికల నగారా మోగనుంది.ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పాలక పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) ఖచ్చితంగా భారత సంతతికి చెందిన వ్యక్తులకు అవకాశం కల్పిస్తుందని సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ ( Singapore Prime Minister Lawrence Wong )ఆదివారం వ్యాఖ్యానించారు.వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమలు, ప్రజా సేవ సహా అనేక రంగాలలో భారతీయ కమ్యూనిటీ దేశానికి చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
2020 సార్వత్రిక ఎన్నికల్లో పీఏపీ 27 ( PAP 27 )మంది కొత్త అభ్యర్ధులకు అవకాశం కల్పించగా.వీరిలో భారతీయులెవ్వరూ లేరు.
ఇది ఆ దేశ పార్లమెంట్‌లో భారతీయుల ప్రాతినిథ్యం గురించి చర్చకు దారి తీసింది.భారతీయ సమాజానికి చెందిన యువకులతో జరిగిన సంభాషణలో వాంగ్ మాట్లాడుతూ.
మీరు దేశంలో ఓ చిన్న సమూహం కావొచ్చు, కానీ ఖచ్చితంగా సింగపూర్‌కు మీ సహకారం.సింగపూర్‌పై మీరు చూపే ప్రభావం చిన్నది కాదని వ్యాఖ్యానించారు.

మీరు ఇప్పటికే ఆ సింగపూర్ స్పూర్తిని ప్రతిబింబిస్తున్నారని.సింగపూర్‌కు మీ కథ చిన్నదే అయినప్పటికీ అది ప్రభావంతమైనదని వాంగ్ ( Wang )వ్యాఖ్యానించినట్లుగా ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.సింగపూర్‌లోని భారతీయులు వ్యాపారం, పరిశ్రమలు, ప్రభుత్వంలో కీలక పాత్ర సహా అనేక రంగాలలో దేశానికి గణనీయమైన సహకారాన్ని అందించారని వాంగ్ ప్రశంసించారు.

సింగపూర్ నివేదికల ప్రకారం.2004లో సింగపూర్ పౌరులలో భారతీయులు 7.6 శాతం మంది ఉండగా , మలయ్, చైనీయులు వరుసగా 15.1 శాతం, 75.6 శాతం మంది ఉన్నారు.90 నిమిషాల పాటు వాంగా ఇప్పో పెసలామ్ చాట్ (రండి, తమిళంలో చాట్ చేద్దాం) అనే వీఐపీ చాట్‌ను తమిళ్ మరసు వార్తాపత్రికి నిర్వహించింది.భారత సంతతికి చెందిన డిజిటల్ అభివృద్ధి, సమాచార శాఖ సీనియర్ సహాయ మంత్రి జనిల్ పుతుచ్చేరి సహా దాదాపు 130 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో పీఏపీ నుంచి కొత్తగా భారతీయ అభ్యర్ధులు ఉంటారని సంకేతాలు ఇచ్చిన ప్రధాన మంత్రి.వారు ఎవరనేది మాత్రం చెప్పలేదు.