క్రికెట్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తుంటారు.ఇక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League )(ఐపీఎల్) 2025 సీజన్ మరింత రసవత్తరంగా, ఆధునికంగా మారింది.క్రికెట్ అభిమానుల కళ్లకు విందుగా మారిన ఈ టోర్నీ ఇప్పుడు టెక్నాలజీ పరంగా కూడా ఓ కొత్త మైలురాయిని చేరింది.
ప్రతి ఏడాది ఐపీఎల్‌లో నూతన ఆవిష్కరణలతో ప్రేక్షకులను అలరించే బీసీసీఐ, ఈసారి సరికొత్త టెక్నాలజీతో అభిమానుల ముందు నిలిచింది.తాజాగా బీసీసీఐ ఐపీఎల్ 2025 సీజన్‌లో రోబోటిక్ డాగ్ ను పరిచయం చేసింది.
కుక్క ఆకారంలో కనిపించే ఈ రోబోలో అత్యాధునిక హైక్వాలిటీ కెమెరాలు అమర్చారు.ఈ కెమెరాల సహాయంతో ఆటలోని ప్రత్యేకమైన దృశ్యాలను వినూత్నంగా ప్రెజెంట్ చేస్తోంది.
ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతిని అందిస్తూ, టెక్నాలజీని ఉపయోగించి క్రికెట్ ఎంటర్టైన్‌మెంట్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్తోంది.
ఈ రోబోటిక్ కుక్కకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇది నడవగలదు, పరిగెత్తగలదు, దూకగలదు కూడా.మిమ్మల్ని నవ్వించగలదు! అంటూ ఐపీఎల్ అధికారిక అకౌంట్ ఓ వీడియోను షేర్ చేస్తూ, ఈ రోబోకు అభిమానులు పేరు సూచించాలని కోరింది.
మాజీ క్రికెట్ లెజెండ్, ప్రముఖ వ్యాఖ్యాత డానీ మోరిసన్( Danny Morrison ) ఈ రోబోటిక్ డాగ్‌ను అభిమానులకు పరిచయం చేశారు.ఆయన స్వరానికి ఈ రోబో ఎలా స్పందిస్తుందో కూడా వీడియోలో చూపించారు.
మైదానంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా, మోరిసన్ ఈ రోబోను మైదాన మధ్యకు తీసుకెళ్లారు.
ఇందులో భాగంగా.ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్( Captain Hardik Pandya, Delhi Capitals captain Axar Patel ) ఈ రోబో కుక్కతో ఆడుతూ, కరచాలనం చేశారు.మైదానంలో ఉన్న ఇతర ఆటగాళ్లను ఈ రోబో వెంబడించడంతో వారు ఆశ్చర్యపోయారు.
రోబో చేష్టలను చూసి ఆటగాళ్లు ఆనందంతో నవ్వుతుండగా, ప్రేక్షకులు మాత్రం ‘ఇదేం టెక్నాలజీ భయ్యా.’ అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఆటలో ప్రవేశపెట్టడంలో బీసీసీఐ మరొకసారి ముందుందని నిరూపించుకుంది.క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాకుండా, ఒక విజువల్ ఎక్స్‌పీరియన్స్ గా మారిన ఈ రోజుల్లో, ఇటువంటి సాంకేతిక మార్పులు అభిమానులకు కొత్త కోణాన్ని అందిస్తున్నాయి.
ఈ రోబోటిక్ డాగ్‌తో ఐపీఎల్ 2025 సీజన్ మరింత అద్భుతంగా మారింది.ఆట, వినోదం, టెక్నాలజీ ఈ మూడింటి కలయికతో క్రికెట్ ఫ్యాన్స్‌కు ఇది ఓ మధురమైన అనుభవంగా నిలిచేలా ఉంది.
ఈ రోబో కుక్కకు పేరు సూచించమని ఐపీఎల్ చేసిన విజ్ఞప్తి అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.