ప్రస్తుత వేసవి కాలంలో అధిక వేడి కారణంగా చాలా మంది పిల్లలు డయేరియా బారిన పడుతుంటారు.అసలే పిల్లల శరీరాల్లో నీటి శాతం తక్కువగా ఉంటుంది.
దానికి తోడు డయేరియాకు గురైతే పిల్లలు నీరసంగా, బలహీనంగా మారిపోతారు.పైగా డయేరియా పిల్లలకు తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
అయితే అలాంటి సమయంలో పిల్లలకు ఎలాంటి ఆహారాలను ఇస్తే త్వరగా డయేరియా నుంచి వారు బయటపడతారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
డయేరియాను నివారించి శరీరాన్ని మళ్లీ శక్తివంతంగా మార్చడానికి అన్నం వార్చిన గంజి అద్భుతంగా సహాయపడుతుంది.
అన్నం వార్చిన గంజిలో చిటికెడు నల్ల ఉప్పును కలిపి పిల్లల చేత తాగిస్తే వారు వేగంగా కోలుకుంటారు.
పిల్లలు డయేరియా బారిన పడినప్పుడు వారికి తప్పకుండా ఓఆర్ఎస్ ఇవ్వాలి.
ఎందుకంటే, విరేచనం ద్వారా శరీరం కోల్పోయే ఖనిజ లవణాలను తిరిగి అందించడంలోనూ మరియు వాటర్ లాస్ ను పూడ్చడంలోనూ ఓఆర్ఎస్ గ్రేట్‌గా హెల్ప్ చేస్తుంది.

అలాగే డయేరియాకు గురైన పిల్లలు నీరసంగా మారిపోతుంటారు.ఆ నీరసాన్ని పోగొట్టాలంటే వారికి బార్లీ గంజి, సగ్గు బియ్యం జావ, మజ్జిగ, కొబ్బరి నీరు, క్యారెట్ సూప్ వంటివి ఇవ్వాలి.ఇవి నీరసాన్ని తరిమికొట్టి బాడీని యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా మారుస్తాయి.

డయేరియాను త్వరగా తగ్గించే సామర్థం మెంతులకు ఉంది.ఒక కప్పు పెరుగులో వన్ టేబుల్ స్పూన్ వేయించిన మెంతులు వేసి పిల్లల చేత తినిపిస్తే సూపర్ ఫాస్ట్‌గా రికవరీ అవుతారు.లేదా ఒక కప్పు పెరుగులో హాప్ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, రెండు టేబుల్ స్పూన్ల పుదీనా రసం, చిటికెడు నల్ల ఉప్పు కలిపి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
ఇక అరటిపండు, సపోట పండ్లు, బత్తాయి జ్యూస్, గోధుమ పాయసం, పాలు, పెరుగు వంటి ఆహారాలను డయేరియా బారిన పడిన పిల్లల చేత తినిపించాలి.
తద్వారా వారు వేగంగా ఆ సమస్య నుంచి బయట పడతారు.