ఐపీఎల్ 2025లో టెక్నాలజీ సంచలనం: బీసీసీఐ పరిచయం చేసిన రోబోటిక్ కుక్క

క్రికెట్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగిస్తుంటారు.ఇక టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత క్రికెట్ బోర్డు అందరికంటే ఓ అడుగు ముందే ఉంటుంది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League )(ఐపీఎల్) 2025 సీజన్ మరింత రసవత్తరంగా, ఆధునికంగా మారింది.

క్రికెట్‌ అభిమానుల కళ్లకు విందుగా మారిన ఈ టోర్నీ ఇప్పుడు టెక్నాలజీ పరంగా కూడా ఓ కొత్త మైలురాయిని చేరింది.

ప్రతి ఏడాది ఐపీఎల్‌లో నూతన ఆవిష్కరణలతో ప్రేక్షకులను అలరించే బీసీసీఐ, ఈసారి సరికొత్త టెక్నాలజీతో అభిమానుల ముందు నిలిచింది.

తాజాగా బీసీసీఐ ఐపీఎల్ 2025 సీజన్‌లో రోబోటిక్ డాగ్ ను పరిచయం చేసింది.

కుక్క ఆకారంలో కనిపించే ఈ రోబోలో అత్యాధునిక హైక్వాలిటీ కెమెరాలు అమర్చారు.ఈ కెమెరాల సహాయంతో ఆటలోని ప్రత్యేకమైన దృశ్యాలను వినూత్నంగా ప్రెజెంట్ చేస్తోంది.

ఫ్యాన్స్‌కు కొత్త అనుభూతిని అందిస్తూ, టెక్నాలజీని ఉపయోగించి క్రికెట్ ఎంటర్టైన్‌మెంట్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్తోంది.

"""/" / ఈ రోబోటిక్ కుక్కకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది నడవగలదు, పరిగెత్తగలదు, దూకగలదు కూడా.మిమ్మల్ని నవ్వించగలదు! అంటూ ఐపీఎల్ అధికారిక అకౌంట్ ఓ వీడియోను షేర్ చేస్తూ, ఈ రోబోకు అభిమానులు పేరు సూచించాలని కోరింది.

మాజీ క్రికెట్ లెజెండ్, ప్రముఖ వ్యాఖ్యాత డానీ మోరిసన్( Danny Morrison ) ఈ రోబోటిక్ డాగ్‌ను అభిమానులకు పరిచయం చేశారు.

ఆయన స్వరానికి ఈ రోబో ఎలా స్పందిస్తుందో కూడా వీడియోలో చూపించారు.మైదానంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా, మోరిసన్ ఈ రోబోను మైదాన మధ్యకు తీసుకెళ్లారు.

"""/" / ఇందులో భాగంగా.ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్( Captain Hardik Pandya, Delhi Capitals Captain Axar Patel ) ఈ రోబో కుక్కతో ఆడుతూ, కరచాలనం చేశారు.

మైదానంలో ఉన్న ఇతర ఆటగాళ్లను ఈ రోబో వెంబడించడంతో వారు ఆశ్చర్యపోయారు.రోబో చేష్టలను చూసి ఆటగాళ్లు ఆనందంతో నవ్వుతుండగా, ప్రేక్షకులు మాత్రం ‘ఇదేం టెక్నాలజీ భయ్యా.

’ అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఆటలో ప్రవేశపెట్టడంలో బీసీసీఐ మరొకసారి ముందుందని నిరూపించుకుంది.

క్రికెట్ కేవలం ఆట మాత్రమే కాకుండా, ఒక విజువల్ ఎక్స్‌పీరియన్స్ గా మారిన ఈ రోజుల్లో, ఇటువంటి సాంకేతిక మార్పులు అభిమానులకు కొత్త కోణాన్ని అందిస్తున్నాయి.

ఈ రోబోటిక్ డాగ్‌తో ఐపీఎల్ 2025 సీజన్ మరింత అద్భుతంగా మారింది.ఆట, వినోదం, టెక్నాలజీ ఈ మూడింటి కలయికతో క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇది ఓ మధురమైన అనుభవంగా నిలిచేలా ఉంది.

ఈ రోబో కుక్కకు పేరు సూచించమని ఐపీఎల్ చేసిన విజ్ఞప్తి అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

Viggo Slots : Application Mobile Et Expérience Mobile (FR)