సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా పండుగ రోజున లేదా ప్రత్యేక రోజులప్పుడు దేవుడికి కి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించడం ఎన్నో సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తోంది.అయితే కొందరు ఇంట్లో వారి స్థాయికి తగ్గట్టుగా దేవుడికి నైవేద్యం తయారుచేసి సమర్పిస్తుంటారు.
మరికొందరు మాత్రం ఏ రోజు ఏ దేవుడికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది.అయితే ఏ దేవుడికి ఏ విధమైనటువంటి నైవేద్యం సమర్పిస్తే ప్రీతికరం చెందుతారో ఇక్కడ తెలుసుకుందాం…
వెంకటేశ్వర స్వామి:

కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వర స్వామికి వడపప్పు, పానకము నైవేద్యంగా సమర్పించి తులసి మాలతో పూజ చేయటం వల్ల స్వామివారు ప్రీతి చెందుతారు.
వినాయకుడు:

ప్రథమ పూజ్యుడైన వినాయకుడికి బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలను నైవేద్యంగా సమర్పించాలి.అదేవిధంగా స్వామివారిని తెల్లని అక్షతలతో పూజించాలి.వినాయకుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసిమాలను సమర్పించకూడదు.
ఆంజనేయ స్వామి:

ఆంజనేయస్వామికి అప్పుల నైవేద్యం సమర్పించి సింధూరం, తమలపాకులతో పూజించడం వల్ల స్వామివారి ఎంతో ప్రీతి చెందుతారు.
సూర్యుడు:

సమస్త జీవకోటికి ప్రాణాధారమైన సూర్యభగవానుడుకి మొక్క పెసలు, పాల అన్నం నైవేద్యంగా సమర్పించాలి.
లక్ష్మీదేవి:

క్షీరాన్నము, తీపి పండ్లతో నైవేద్యం సమర్పించి, తామర పువ్వులతో పూజించాలి.
లలితా దేవి:

క్షీరాన్నము, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము నైవేద్యంగా సమర్పించడం వల్ల అమ్మవారు ఎంతో ప్రీతి చెందుతారు.
శ్రీకృష్ణుడు:

అటుకులతో కూడిన తీపి పదార్థాలు, వెన్న నైవేద్యంగా సమర్పించి, తులసి దళాలతో పూజ చేయటం వల్ల స్వామి వారి ఎంతో ప్రీతి చెందుతారు.
శివుడు:

కొబ్బరికాయ, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించి మారేడు దళాలు, నాగమల్లి పువ్వులతో స్వామివారిని పూజించాలి.
ఈ విధంగా ఏ దేవుడికి ఇష్టమైన నైవేద్యం ఆ దేవుడికి సమర్పించి పూజ చేయటం వల్ల స్వామివారి ప్రీతి చెంది కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.