గోల్డెన్ టెంపుల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..

గోల్డెన్ టెంపుల్ సిక్కుల పవిత్రమైన మత దేవాలయం.స్వర్ణ దేవాలయాన్ని “హర్మందిర్ సాహిబ్ష‌, “అత్ సత్ తీర్థం” అని కూడా పిలుస్తారు.

 Some Interesting Things About The Golden Temple, Harmandir Sahib, At Sat Theerth-TeluguStop.com

గోల్డెన్ టెంపుల్ ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఒకటి.ఈ ఆలయ సౌందర్యం ప్రతి ఒక్కరి మనసును దోచుకుంటుంది.

ప్రతిరోజూ వేలాది మంది భక్తులు,పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.స్వర్ణ దేవాలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సిక్కు మత పవిత్ర గ్రంథం “గురు గ్రంథ్” సాహిబ్ మొదట హర్మందిర్ సాహిబ్‌లోనే స్థాపిత‌మ‌య్యింది.సిక్కుల మొదటి గురువు గురునానక్ దేవ్.స్వర్ణ దేవాలయం నిర్మించిన ప్రదేశంలో ధ్యానం చేశారు.హర్మందిర్ సాహిబ్ సిక్కు మత ఐదవ గురువు అర్జున్ దేవ్ జీచే స్థాపిత‌మ‌య్యింది మహారాజా రంజిత్ సింగ్ 19వ శతాబ్దంలో పంజాబ్ రాజుగా ఉన్నారు.

అతని పదవీకాలంలో స్వర్ణ దేవాలయం పునరుద్ధరించారు.హర్మందిర్ సాహిబ్ నిర్మించిన‌ప్పుడు దానిని బంగారంతో పాలిష్ చేయలేదు.

హర్‌మందిర్ సాహిబ్‌లో ఏర్పాటు చేసిన లంగర్‌లో ప్రతిరోజూ దాదాపు 35,000 మంది ఆహారం తింటారు.ఈ ఆలయంలో జ‌రిగే లంగర్ సేవ ప్రపంచంలోనే అతిపెద్ద సేవ.

బాబా బుధా జీ హర్మందిర్ సాహిబ్ మొదటి పూజారి.హర్మందిర్ సాహిబ్‌లోకి ప్రవేశించడానికి నాలుగు మార్గాలు ఉన్నాయి.

గోల్డెన్ టెంపుల్‌లో నిర్మించిన నాలుగు ప్రధాన మార్గాల గుండా ఏ మ‌తానికి చెందిన‌వార‌యినా ఆ ఆలయానికి రావచ్చు.హర్మందిర్ సాహిబ్‌లో సిక్కుమతానికి చెందిన పురాతన చారిత్రక వస్తువులు ఉన్నాయి.

ఇక్క‌డ‌కు ప్రతిరోజూ దేశ విదేశాల నుండి కోట్లాది మంది భక్తులు వ‌స్తుంటారు.సిక్కుల ప్రధాన పండుగలు బైసాఖీ, గురు రామ్ దాస్ పుట్టినరోజు, గురు తేజ్ బహదూర్ వర్ధంతి, గురు నానక్ దేవ్‌ పుట్టినరోజు మొదలైనవి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube