ధనవంతులు కావాలని రాత్రి అనకా పగలనకా చాలామంది ప్రజలు శ్రమిస్తూ ఉంటారు.మనం సంపాదించిన డబ్బును ఇంట్లో బీరువాలో ఉంచి ఖర్చు చేస్తూ ఉంటాము.
డబ్బు ఉంచే బీరువా( Almirah )ను ఇంట్లో వాస్తు ప్రకారం సరైన దిశలో, సరైన స్థలంలో ఉంచడం ఎంతో ముఖ్యం.లేకపోతే సంపాదించిన డబ్బు వృధా అవుతుంది.
అంతేకాకుండా చివరకు మీరు డబ్బు సమస్యలను ఎదుర్కొంటారు.వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ఆ ఇంట్లో నివసించే వారి జీవితం పై ప్రభావం చూపుతుంది.
ఆ విధంగా డబ్బు డిపాజిట్ చేసే బీరువా వాస్తు ప్రకారం ఉంటే బీరువాలో ఎక్కువ డబ్బు పేరుకుపోతుంది.ఇప్పుడు బీరువాను వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలో కొన్ని వాస్తు చిట్కాలు తెలుసుకుందాం.

వాస్తు శాస్త్రం( Vastu shastra ) ప్రకారం తూర్పు దిశను పురోగతి మరియు శక్తి దిశగా పిలుస్తారు.ఈ దిశకు అధిపతి దేవతల రాజు ఇంద్రుడు.కాబట్టి మీరు మీ ఇంట్లో మీ సంపదను రక్షించుకోవడానికి అలాగే పెంచుకోవడానికి బీరువాను పశ్చిమ దిశలో మరియు తూర్పు దిశలో ఉంచడం ఎంతో మంచిది.అంతే కాకుండా ఇలా చేయడం వల్ల ఇంద్రుడి అనుగ్రహంతో ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది.
అలాగే ఇంట్లో బీరువా దక్షిణ దిశకు ఎదురుగా ఉంచకూడదు.బహుశా మీ ఇంట్లో ఇలా జరిగితే వెంటనే దిశను మార్చేయాలి.
ముఖ్యంగా చెప్పాలంటే ఒకరి సంపద పెరగాలంటే ఒకరి కష్టానికి తగ్గ ఫలితం పొందాలంటే జీతం లో కొంత భాగాన్ని పొదుపు చేస్తూ ఉండాలి.కానీ మీరు డబ్బును ఆదా చేయకపోతే ఇంట్లో బీరువా తప్పు దిశలో ఉంది అని అర్థం చేసుకోవచ్చు.

ఇంట్లో బీరువా పెట్టుకునేటప్పుడు దిక్కు మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలు కూడా గమనించాలి.అంటే గది తలుపుకు ఎదురుగా బీరువా ఉండకూడదు.అలా అయితే ఇది అనవసరమైన ఖర్చులను పెంచుతుంది.బీరువాను ఎప్పుడూ భూమికి కాస్త ఎత్తులో ఉంచాలి.అందుకు బీరువా కింద చెక్క స్టాండ్ పెట్టడం మంచిది.ప్రధానంగా మనీ డిపాజిట్ చేసే బీరువాను రోజు శుభ్రం చేయాలి.
ఎందుకంటే లక్ష్మీదేవి( Lakshmi Devi ) పరిశుభ్రమైన ప్రదేశాలలో మాత్రమే ఉంటుంది.కాబట్టి డబ్బు ఉంచే ప్రదేశంలో చెత్త లేకుండా చూసుకోవడం మంచిది.