దీపావళి రోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే కోటీశ్వరులు అవుతారు

దీపావళి పండుగ ఆంటే అందరు ఇష్టపడతారు.ఆ రోజు పూజ చేసుకొని టపాసులు కాల్చుతారు.

 Diwali Deepam Details-TeluguStop.com

లక్ష్మి దేవి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు,వ్రతాలూ చేస్తూ ఉంటాం.ఆలా కాకుండా దీపావళి రోజు లక్ష్మి దేవి అనుగ్రహం పొందితే ఆ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఆనందంగా ఉండవచ్చు.

అయితే దీపావళి రోజు లక్ష్మి దేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసుకుందాం.

దీపావళి రోజు తెల్లవారి జామునే లేచి తలస్నానము చేయాలి.

దీపావళి సాయంత్రం అమ్మవారికి ఇష్టమైన పూలతో అలంకరణ మరియు ఇష్టమైన నైవేద్యాలు వండాలి.అమ్మవారికి పాలు అంటే ప్రీతి.

అందువల్ల పాలతో తయారుచేసిన పిండి వంటలను చేసి నైవేద్యంగా సమర్పించాలి.అంతేకాక లక్ష్మి దేవికి తెల్లని పూలంటే ఇష్టం.

కాబట్టి తెల్లని పూలతో పూజ చేయాలి.ఆ తరవాత దీపాలను వెలిగిస్తాం.

ఆ దీపాలను ఇంటిలోనూ బయట పెడుతూ ఉంటాం.

దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించిన ఒక దీపం మాత్రం రాత్రంతా వెలుగుతూ ఉంటే సిరి సంపదలు కలుగుతాయి.

ఆ దీపంలో మూడు ఒత్తులు వేసి నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వెలిగించాలి.ఈ దీపం ఉదయం సూర్యోదయం వరకు వెలుగుతూ ఉండాలి.

అలాగే ఒక దీపాన్ని ఏదైనా గుడిలో వెలిగిస్తే సమస్త దేవతల ఆశీస్సులు పొందుతారు.కాబట్టి దీపావళి రోజు ఈ ఒక్క దీపం వెలిగిస్తే సిరి సంపదలపాటు సుఖ సంతోషాలు మీ సొంతం అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube