శ్రీ రామ నవమి రోజున చేయకూడని పనులు ఇవే..

చైత్ర నవరాత్రి చివరి రోజు శ్రీరామునికి అంకితం చేయబడిదాని పండితులు చెబుతున్నారు.మార్చి 30వ తేదీన శ్రీరామనవమి( Sri Rama Navami )పండుగను ప్రజలందరూ జరుపుకుంటారు.

 These Are The Things That Should Not Be Done On Sri Rama Navami ,sri Rama Navami-TeluguStop.com

చైత్రమాసం శుక్ల పక్షం 9వ రోజున పుష్ప నక్షత్రంలో పూర్ణమి రోజున శ్రీరాముడు ( Lord Rama )అవతరించాడని ప్రజలందరూ నమ్ముతారు.శ్రీరాముని భక్తులు సాధారణంగా ఈ కార్యక్రమానికి చాలా రోజుల ముందు నుంచే సన్నాహాలు చేస్తూ ఉంటారు.

మరి కొందరు భక్తులు శ్రీరాముడి గొప్ప వ్యక్తిత్వాన్ని చూసి మనం కూడా శ్రీరాముడులా ఉండాలని అనుకుంటూ ఉంటారు.శ్రీరామనవమి రోజున ఎలాంటి కార్యక్రమాలు నిషేధించబడ్డాయో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీరామనవమి రోజున తమాసిక ఆహారాలు మాంసాహారం, మద్యపానానికి ( Meat,alcohol )దూరంగా ఉండటం మంచిది.ముఖ్యంగా చెప్పాలంటే ఉల్లిపాయలు, వెల్లుల్లి జోడించకుండా ఆహారాన్ని తీసుకోవచ్చు.నవరాత్రి వేళ జుట్టు కత్తిరించుకోకూడదు.ఈ పండుగ సమయంలో షేవింగ్ కూడా చేసుకోకూడదు.ఇతరులను అసలు విమర్శించకూడదు.ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు.

మాటలు, ఆలోచన తో ఇతరులను బాధ పెట్టకూడదు.ఎందుకంటే శ్రీరాముని వ్యక్తిత్వం అలాంటిది మరి.

శ్రీరామనవమి రోజున చేయవలసిన పనులు.చాలా ప్రాంతాల్లో శ్రీరాముడి విగ్రహాన్ని ఉయ్యాలలో ఉంచుతారు.ఉపవాసం ఆచరించడం వల్ల మీకు సుఖం, శ్రేయస్సు కలిగి, పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు.మీరు నిద్రలేచిన వెంటనే దేవునికి అర్ఘ్యం సమర్పించాలి.అయోధ్యలోని సరయు నదిలో పవిత్ర స్నానం చేయడం వలన మీ గత జన్మల పాపాలు దూరం అయిపోతాయి.శ్రీరామనవమి రోజున రామ కీర్తనలు, భజనలు, స్తోత్రాలు పఠించాలి.

మీ భక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత పుణ్యఫలం లభిస్తుంది.ఇంకా చెప్పాలంటే నిరుపేదలకు దానం చేయడం మంచిది.

శ్రీరామ నవమి రోజున ఎవరిని మోసం చేయకూడదని, అలాగే ఎవరిని హింసించకూడదని పండితులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube