దయ్యాలు కట్టిన ఆలయం వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.చాలామంది దయ్యాలు ఉన్నాయా అని భావిస్తుంటారు.
దేవుడున్నాడని నమ్మేవాళ్ళు దయ్యాలు కూడా ఉంటాయని విశ్వసిస్తారు.పురాణాల ప్రకారం మనదేశంలో కొన్ని ఆలయాలు స్వయంగా దేవతలే నిర్మించారని మనం చదివే ఉంటాం.
అదే విధంగా దెయ్యాలు కట్టించిన ఆలయాలు కూడా మనదేశంలో ఉన్నాయి.ఆ విధంగా దయ్యాలు నిర్మించిన ఆలయం కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో ఉంది.
అయితే ఈ ఆలయాన్ని దెయ్యాలు కట్టించడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
బెంగళూరుకు సమీపంలోని బొమ్మవర అనే గ్రామంలో సుందరేశ్వర ఆలయం ఉంది.ఈ ఆలయంలో శివుడు భక్తులకు దర్శనం ఇస్తుంటారు.
ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఎంతో అందంగా ఉంటుంది.అందుకే ఈ ఆలయాన్ని సుందరేశ్వర ఆలయం అని పిలుస్తారు.
ఈ గ్రామంలో పూర్వం దయ్యాలు విపరీతంగా ఉంటూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసేవి.ఈ దెయ్యాలను భరించలేక గ్రామ ప్రజలకి ఏం చేయాలో అర్థం కాక అదే ఊరికి చెందిన దెయ్యాల మాంత్రికుడుని కలిసి పరిష్కార మార్గాన్ని అడిగారు.
ఆ మాంత్రికుడికి ఉన్న మంత్ర విద్యలతో దయ్యాలను తరిమికొట్టాలని ప్రయత్నించినప్పటికీ అతని చేతకాలేదు.

దీంతో ఆ ఊరిలో ఒక శివాలయం నిర్మించడం వల్ల దెయ్యాలను తరిమి కొట్టవచ్చునని భావించిన మాంత్రికుడు గ్రామ ప్రజల సహకారంతో ఆ ఊరిలో శివాలయాన్ని నిర్మించడంతో అది భరించలేని దయ్యాలు రాత్రికిరాత్రి ఆలయాన్ని ధ్వంసం చేశాయి.దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మాంత్రికుడు మరింత మంత్ర విద్యలు నేర్చుకొని ఆ దెయ్యాలని తన వశం చేసుకున్నాడు.ఆ దయ్యాలు మాంత్రికుడి వశం కావడంతో వారికి విముక్తి కల్పించాలని శరణు కోరాయి అయితే అందుకు ఆ మాత్రికుడు ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించాలని, అప్పుడే వారికి విముక్తి కలుగుతుందని తెలియజేయడంతో దయ్యాలు రాత్రికి రాత్రే ఆ శివాలయాన్ని నిర్మించాయని పురాణాలు చెబుతాయి.
ప్రస్తుతం ఆ గ్రామంలో ఉన్న ఈ శివాలయాన్ని చూస్తే మనకు ఈ ఆలయం దయ్యాలు నిర్మించాయి అర్థమవుతుంది.ఆలయం పై ఉన్న బొమ్మలు అన్ని కూడా దెయ్యాలు బొమ్మలు.
రాత్రికి రాత్రి ఈ ఆలయాన్ని నిర్మించిన దయ్యాలు ఆ ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్టించడం మరిచిపోయాయి.అప్పటి నుంచి ఆ ఆలయం ఖాళీగానే ఉంది.50 సంవత్సరాల క్రితం మంచినీటి కోసం ఆ గ్రామంలో ఒక బావిని తగ్గుతున్న క్రమంలో ఆ బావిలో శివలింగం బయటపడడంతో ఆ శివలింగాన్ని ఈ ఆలయంలో ప్రతిష్టించి పూజలను నిర్వహిస్తున్నారు.