వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు సమస్యలనుండి బయటపడాలంటే ఇంట్లో మనీ ప్లాంట్, లక్కీ వెదురు, కుబేర మొక్క లాంటివి ఉంటే మంచిదని చాలామంది అనుకుంటూ ఉంటారు.కానీ అవి మాత్రమే కాకుండా ఈ చెట్టు ఉన్న కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
అదేదో కాదు అశోక వృక్షం.( Ashoka Tree ) వాస్తు శాస్త్రంలోనే కాకుండా జ్యోతిష్య శాస్త్రంలో కూడా అశోక వృక్షానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
హిందూ మతం బౌద్ధ మతంలో అశోక వృక్షానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.రామాయణం( Ramayan ) ప్రకారం సీత లంకలో అశోక వృక్షం కిందే కూర్చుంటుందని చెప్పుకొచ్చారు.
అశోక అంటే శోకం లేనిది అని అర్థం.ఇది అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇస్తుంది.
ఇది వేదన, దుఃఖాన్ని కూడా తొలగిస్తుంది.
అది మాత్రమే కాకుండా ఈ చెట్టు కామదేవుడిగా భావించే మన్మధుడితో ముడిపడి ఉంటుంది.ఇక హిందూ సంస్కృతి ప్రకారం అత్యంత పవిత్రమైన చెట్లలో ఇది ఒకటిగా పరిగణిస్తారు.హిందువులు చైత్రమాసంలో( Chaitra Masam ) అశోక వృక్షాన్ని పూజిస్తారు.
అయితే ఈ చెట్టు ఇంట్లో ఉండడం వలన ప్రతికూల శక్తులు దరిచేరవు.వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి.
మీ చుట్టూ ఉన్న దుఃఖాన్ని కూడా తొలగిస్తుంది.ఆర్థికపరమైన సమస్యల నుండి కూడా బయటపడేస్తోంది.
అయితే వాస్తు ప్రకారం అశోక చెట్టుని ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉత్తర దిశలో నాటితే ప్రయోజనకరంగా ఉంటుంది.అలాగే ఇంటి ఆవరణలో పెంచుకోవడం వలన ఆర్థిక సమస్యల నుండి బయటపడవచ్చు.
ఇక ఇంటికి ఉత్తర దిశలో ఈ చెట్టు ఉండటం వలన ఎలాంటి సమస్యలు కూడా దరి చేరవు.ఒక శుభముహూర్తంలో అశోక చెట్టు వేరు కొద్దిగా తీసి దాన్ని గంగాజలంతో శుభ్రం చేయాలి.ఇక వేరుని పూజ స్థలంలో ఉంచడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి.చాలామంది జాతకంలో మంగళ దోషం( Mangala Dosham ) లేదా కుజదోషం ఉంటుంది.దీని వలన పెళ్లి ( Marriage ) కావడం ఆలస్యం అవుతుంది.అలాంటి వారు దోష ప్రభావం తగ్గించుకునేందుకు అశోక చెట్టు చక్కని పరిష్కారం ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
అశోక చెట్టుని నాటడం వలన ఈ దోషాలు తొలగిపోయి, వివాహ గడియలు వస్తాయి.
DEVOTIONAL