హెయిర్ ఫాల్. స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని బాధిస్తున్న సమస్య ఇది.
రోజుకు ఎంతోకొంత జుట్టు రాలడం సర్వ సాధారణం.కానీ, కొందరికి జుట్టు అధికంగా రాలిపోతుంటుంది.
దాంతో హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టడం కోసం నానా పాట్లు పడుతుంటారు.ఖరీదైన షాంపూలు, నూనెలు, సీరమ్‌లు యూస్ చేస్తుంటారు.
ఇరుగు పొరుగు వారు చెప్పిన హెయిర్ ప్యాకులు, మాస్క్‌లు వేసుకుంటారు.అయినప్పటికీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వకుంటే ఏం చేయాలో తెలియక తెగ హైరానా పడిపోతుంటారు.
ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్సలు బాధపడకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకుంటే హెయిర్ ఫాల్‌కి బై బై చెప్పొచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ఏంటీ.? దాన్ని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక కీర దోసను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి.అలాగే నాలుగు ఉసిరి కాయలను తీసుకుని వాటర్‌లో కడిగి గొంజ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర స్లైసెస్, ఉసిరి కాయ ముక్కలు, ఒక రెబ్బ కరివేపాకు, పావు టేబుల్ స్పూన్ పింక్ సాల్ట్, చిటికెడు మిరియాల పొడి, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే కీర ఆమ్లా జ్యూస్ సిద్ధమవుతుంది.
ఈ జ్యూస్‌ను ఒక గ్లాస్ చప్పున రోజుకు ఒకసారి తీసుకుంటే హెయిర్ ఫాల్ సమస్య క్రమంగా తగ్గిపోయి.
ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది.అలాగే ఈ జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారు.
శరీరంలో పేరుకుపోయిన మలినాలు, వ్యర్థాలు తొలగిపోతాయి.లివర్ శుభ్రంగా మారుతుంది.
మరియు చర్మం కూడా నిగారింపుగా మెరుస్తుంది.