చర్మం యవన్నంగా కనపడాలంటే... డార్క్ చాకోలెట్ మాస్క్ లు

చర్మ సౌందర్యంలో డార్క్ చాకొలేట్ చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది.ఫ్రీ రాడికల్స్ అనేవి చర్మంలోని కొలాజెన్ స్థాయిలను విచ్ఛిన్నం చేస్తాయి.

 Amazing Homemade Chocolate Face Masks-TeluguStop.com

డార్క్ చాకోలెట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ని తొలగించి చర్మం దెబ్బతినకుండా రక్షిస్తాయి.కాబట్టి ఇప్పుడు చాకోలెట్ ని ఉపయోగించి ఫెస్ మాస్క్ లు తయారీని తెలుస్కుందాం.

ఒక బౌల్ లో రెండు స్పూన్ల చాకోలెట్ ద్రవాన్ని తీసుకోవాలి.చాకోలెట్ ని మెల్ట్ చేస్తే చాకోలెట్ ద్రవం తయారవుతుంది.ఈ చాకోలెట్ ద్రవంలో ఒక గుడ్డు తెల్లసొనను వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి ఒకేసారి చేస్తే చర్మం కాంతివంతంగా మారటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

ఒక స్పూన్ చాకోలెట్ ద్రవంలో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా నెలలో రెండు సార్లు వేసుకుంటే ఉంటే ఫ్రీ రాడికల్స్ నుండి చర్మానికి రక్షణ కలుగుతుంది.

ఒక స్పూన్ చాకోలెట్ ద్రవంలో ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి ఒకసారి వేస్తె చర్మం యవన్నంగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube